- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
AP Cabinet : ఏపీ మంత్రివర్గం విస్తరణా? ..పునర్ వ్యవస్థీకరణా ??
దిశ, వెబ్ డెస్క్ : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan) సోదరుడు, జనసేన నేత, నటుడు నాగబాబు(Nagababu)ను మంత్రివర్గంలోకి తీసుకుంటామన్న ప్రకటన మేరకు సీఎం చంద్రబాబునాయుడు(CM Chandrababu Naidu) మంత్రివర్గ విస్తరణ(Cabinet Expansion)..పునర్ వ్యవస్థీకరణ(Cabinet Reorganization) దిశగా కసరత్తు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. జనవరి 8న నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకుంటారని, ప్రమాణా స్వీకారోత్సవం అదే రోజున ఉంటుందని కూటమి పార్టీల నేతలు చెబుతున్నారు. నాగబాబుకు మంత్రి పదవి విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే ప్రకటించారు. ఐదు నెలల తర్వాత ఖాళీ అయ్యే ఎమ్మెల్సీ పోస్టుల్లో ఒకటి నాగబాబుకు ఇవ్వడం కూడా దాదాపుగా ఖాయమైంది. ప్రస్తుతం కేబినెట్ లో 25 మంది ఉండగా, ఒకటే ఖాళీ ఉంది. అయితే తొలుత నాగబాబుతో మంత్రివర్గ విస్తరణ పూర్తి చేస్తారని భావించినప్పటికి, ఒకరిద్ధరు మంత్రులను మార్చే అవకాశముందన్న ప్రచారం చోటుచేసుకోవడం ఆసక్తికరంగా మారింది. పని తీరు మార్చుకోని ఇద్దరు ముగ్గురు మంత్రులపై వేటు వేసే అవకాశం లేకపోలేదని, నాగబాబుతో పాటు ఏపీ టీడీపీ అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస రావును మంత్రివర్గంలోకి తీసుకుంటారన్న ప్రచారం అధికార పార్టీ వర్గాల్లో చక్కర్లు కొడుతుంది.
2024 అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఘన విజయం తర్వాత చంద్రబాబు సామాజిక సమీకరణలు..రాజకీయ అవసరాలు..పాలనలో కొత్తదనం వంటి అంశాల నేపథ్యంలో చేపట్టిన మంత్రివర్గం కూర్పులో కొంతమంది సీనియర్ నేతలను పక్కన పెట్టారు. సీనియర్ల అసంతృప్తిని సైతం పట్టించుకోకుండా గతంలో ఎన్నడూ లేని విధంగా చంద్రబాబు తన మంత్రి వర్గంలో తొలి సారి గెలిచిన వారికి మంత్రిపదవులు కట్టబెట్టడం చర్చనీయాంశమైంది. అయితే కొందరి మంత్రుల పనితీరు చంద్రబాబు అంచనాలకు అందుకోలేకపోవడంతో వారి పట్ల ఆయన అసంతృప్తిగా ఉన్నారు. ప్రస్తుత మంత్రి వర్గ సభ్యులలో ఇద్దరు ముగ్గురి పనితీరుపై విషయంలో చంద్రబాబు అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తుంది. వారి పనితీరుపై ఎప్పటికప్పుడు నివేదికలను తెప్పించకుంటూ వారికి మార్కులను కూడా చంద్రబాబు కేటాయిస్తున్నారు. పనితీరు సవ్యంగా లేని ఇద్దరు ముగ్గురిని మంత్రివర్గం నుంచి తప్పించి కొత్త వారికి అవకాశం ఇవ్వాలన్న యోచనలో సీఎం చంద్రబాబు నాయుడు ఉన్నట్లు ప్రచారం వినిపిస్తోంది. అదే జరిగితే చంద్రబాబు మంత్రివర్గ విస్తరణకు బదులుగా మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ చేపట్టడం ఖాయమంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
Read More..