ఈ రోజు రాత్రి భారత్ రానున్న మన్మోహన్ సింగ్ కుమార్తే.. రాజ్ ఘాట్‌లో అంత్యక్రియలు..?

by Mahesh |   ( Updated:2024-12-27 12:15:52.0  )
ఈ రోజు రాత్రి భారత్ రానున్న మన్మోహన్ సింగ్ కుమార్తే..  రాజ్ ఘాట్‌లో అంత్యక్రియలు..?
X

దిశ, వెబ్ డెస్క్: భారత మాజీ ప్రధాని, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత డాక్టర్ మన్మోహన్ సింగ్ (Manmohan Singh)గురువారం రాత్రి కన్నుమూశారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఢిల్లీ (Delhi)లోని ఏయిమ్స్‌ (AIMS)లో చికిత్స పొందుతూ కన్నుమూశారు. కాగా మాజీ ప్రధాని అంత్యక్రియలు కేంద్రం (Central) అధికారిక లాంఛనాలతో నిర్వహించనున్నట్లు ప్రకటించిందంది. ఈ మేరకు శనివారం అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నట్లుగా అధికారులు అధికారిక ప్రకటన విడుదలైంది. ఈ రోజు రాత్రి అమెరికాలో ఉన్న మన్మోహన్ సింగ్ కుమార్తె(Daughter of Manmohan Singh).. భారత్ రానుంది. అనంతరం రేపు ఉదయం 9.30 గంటలకు అంతిమ యాత్ర ప్రారంభం కానుంది. ఇందులో భాగంగా.. రేపు ఉదయం 8 గంటలకు ఏఐసీసీ కార్యాలయానికి మన్మోహన్ సింగ్ పార్ధివదేహాన్ని(Pardhivadeham) తీసుకెళ్లనున్నారు. ఉదయం 8.30 నుంచి 9.30 గంటల వరకు ఏఐసీసీ కార్యాలయం(AICC office)లో మాజీ ప్రధాని పార్థీవ దేహాన్ని ఉంచనున్నారు. కాగా C రాజ్ ఘాట్‌(Raj Ghat)లో అంత్యక్రియలు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.

Advertisement

Next Story

Most Viewed