- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భద్రాద్రి- కొత్తగూడెం కొత్త గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టు మంజూరు చేయండి : మంత్రి తుమ్మల
దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ(Telangana) వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు (Tummala NageshwerRao) గురువారం ఢిల్లీ (Delhi)లో పలువురు కేంద్రమంత్రులతో సమావేశం అయ్యారు. మొదట కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్(Shivaraj Singh Chouhan) తో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా తుమ్మల శివరాజ్ సింగ్ ను శాలువాతో సత్కరించారు. తెలంగాణలో నూతన కోకోనట్ బోర్డ్ (Coconut Board) ఏర్పాటు చేయాలని ప్రత్యేకంగా కేంద్రమంత్రిని కోరారు. ఆయిల్ ఫామ్ మీద దిగుమతి సుంకం పెంచి, దేశీయంగా ఆయిల్ ఫామ్ సాగును ప్రోత్సహిస్తున్నందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఖమ్మం జిల్లాలోని అశ్వరావుపేటలో సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ను ఏర్పాటు చేయాలని కూడా ఈ సందర్భంగా కేంద్ర వ్యవసాయశాఖ మంత్రికి తుమ్మల నాగేశ్వరరావు విన్నవించారు. అలాగే కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్(Rammohan Nayudu Kinjarapu) నాయుడును కలిసి భద్రాద్రి- కొత్తగూడెం కొత్త గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టును మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.