‘తప్పు చేసి ఉంటే లొంగిపోండి మాస్టర్’.. జానీ మాస్టర్‌కు తెలుగు హీరో మెసేజ్

by Gantepaka Srikanth |   ( Updated:2024-09-19 14:50:40.0  )
‘తప్పు చేసి ఉంటే లొంగిపోండి మాస్టర్’.. జానీ మాస్టర్‌కు తెలుగు హీరో మెసేజ్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్(Johnny Master) కేసు వివాదం తీవ్ర చర్చనీయాంశమైంది. దీనిపై రాజకీయాలకు అతీతంగా అందరూ స్పందిస్తున్నారు. ఇప్పటికే ఇండస్ట్రీ నుంచి చాలామంది మహిళా నటులు స్పందించగా.. హీరోల్లో తొలిసారిగా మంచు మనోజ్(Manchu Manoj) స్పందించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ట్వీట్ పెట్టారు. ‘ఈ స్థాయికి రావడానికి జానీ మాస్టర్ ఎంతగా శ్రమించారో అందరికీ తెలుసు. ఆయనపై ఆరోపణలు రావడం చూస్తుంటే నా గుండె తరుక్కుపోతోంది. అసలు తప్పు ఎవరిది అనేది చట్టం నిర్ణయిస్తుంది. ఒక మహిళ ఆరోపణలు చేసినప్పుడు పారిపోవడం భావి తరాలకు ప్రమాదకర మెసేజ్. ఈ కేసులో త్వరగా స్పందించిన హైదరాబాద్ పోలీసులను ప్రత్యేక కృతజ్ఞతలు. మాస్టర్ తప్పు చేయకపోతే పోరాడండి.. దోషి అయితే వెంటనే లొంగిపోండి’ అని మంచు మనోజ్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఈ సున్నితమైన కేసు విషయంలో ధైర్యంగా స్పందించిన మంచు మనోజ్‌పై నెట్టింట్లో ప్రశంసలు వెల్లువెత్తున్నాయి.


Read More..

‘కొంత మంది అమ్మాయిలు ఎదిగిన అబ్బాయిల కెరీర్‌ను దెబ్బ కొట్టడానికి చూస్తున్నారు’.. లేడీ కొరియోగ్రాఫర్ సంచలన కామె...





Advertisement

Next Story

Most Viewed