Business Ideas: మిమ్మల్ని ధనవంతులను చేసే బిజినెస్ ఐడియాలు ఇవే

by Bhoopathi Nagaiah |
Business Ideas: మిమ్మల్ని ధనవంతులను చేసే బిజినెస్ ఐడియాలు ఇవే
X

దిశ, వెబ్‌డెస్క్: పట్టణ ప్రాంతాల్లోనే కాదు.. గ్రామీణ ప్రాంతాల్లోనూ ఇప్పుడు ఉపాధి అవకాశాలు బాగా పెరుగుతున్నాయి. పల్లెల్లో అయితే తక్కువ పెట్టుబడితో మంచి లాభాలను పొందవచ్చు. సిటీస్ లో అయితే వ్యాపారం.. పెట్టుబడి కంటే ఇతర ఖర్చులే ఎక్కువగా ఉంటాయి. దీంతో లాభాల సంగతి పక్కన పెడితే.. పెట్టుబడి తిరిగి వస్తే చాలు అన్నట్లుగా మారుతుంది. అందుకే ఇప్పుడు వ్యాపారం చేసే విధానాలు మారుతున్నాయి. పట్టణాల్లోనే వ్యాపారాలు చేయాలని చాలామంది అనుకోవడం లేదు. గ్రామీణ ప్రాంతాల్లోనూ యూనిట్లు పెట్టి పట్టణాలకు ఆ ప్రొడక్ట్స్ ను సరఫరా చేస్తున్నారు. తక్కువ పెట్టుబడి ఎక్కువ లాభాలు తీసుకువచ్చే అలాంటి బిజినెస్ ఐడియాలు మీకోసం ఇక్కడ ఉన్నాయి. అవేంటో చూద్దాం

నాటు కోళ్ల బిజినెస్‌తో లక్షల్లో ఆదాయం:

నాటు కోళ్ల వ్యాపారం(Country chicken business) ఏ ప్రాంతంలోనైనా బాగా రన్ అవుతుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో కోళ్ల పెంపకానికి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఈ వ్యాపారం కోసం మీరు కనీసం 2 లక్షలకు పైగా పెట్టుబడి పెట్టాలి. కోళ్లు పెంచిన తర్వాత మీ ఊర్లోనే కాకుండా చుట్టుపక్కల గ్రామాలు, పట్టణాలలోనూ విక్రయించవచ్చు. అంతేకాకుండా పట్టణాలలో డీలర్స్ తో కాంట్రాక్టు పెట్టుకుని వారికి నేరుగా ట్రాన్స్ పోర్ట్ చేసినట్లయితే.. మీ బిజినెస్ గురించి సక్సెస్ అవుతుంది. మీరు ఇలా మీ సొంత ఊర్లోనే ఉంటూ మీకు సరిపడా బిజినెస్ స్టార్ట్ చేసి మంచి విజయం సాధించవచ్చు.

కూరగాయల వ్యాపారంతో మంచి లాభాలు:

ఊరిలో చేయగల చక్కటి వ్యాపారం కూరగాయల వ్యాపారం(Vegetable business). మీకు సొంత పొలం ఉన్నట్లయితే.. రకరకాల కూరగాయలను పండిస్తూ.. వాటిని విక్రయించడం ద్వారా మంచి లాభాలను పొందవచ్చు. మీ వ్యాపారం ఇంకా అభివృద్ధి చెందాలంటే సేంద్రియ విధానాల్లో మీరు కూరగాయలు పండించినట్లయితే దిగుబడితో పాటు రెట్టింపు ఆదాయం వస్తుంది. ఈ వ్యాపారం చేయడానికి పెద్దగా పెట్టుబడి అవసరం లేదు. సొంత పొలం ఉంటే కేవలం 50,000 పెట్టుబడితో ఈ బిజినెస్ స్టార్ట్ చేయవచ్చు. కౌలుకు తీసుకున్న పెట్టుబడి పెద్ద అవసరం ఉండదు. కూరగాయల వ్యాపారం బాగా రన్ అవ్వాలంటే మీరు పండించిన కూరగాయలను పట్టణాలకు తీసుకెళ్లి అమ్మడం మంచిది. దీనివల్ల మీ పంటకు మంచి ధరతో పాటు సరుకు కూడా త్వరగా పోతుంది

బట్టల వ్యాపారం:

రెడీమేడ్ బట్టల వ్యాపారం(Trading in readymade garments) మీ ఊర్లో బాగా రన్నవ్వాలంటే కొన్ని టెక్నిక్స్ ని పాటించాల్సి ఉంటుంది. సాధారణంగా గ్రామాల్లో బిజినెస్ లు పెద్దగా సక్సెస్ అవ్వడానికి కారణం బాకీలు. మీ ఊర్లో రెడీమేడ్ బట్టల దుకాణం(Readymade dresses shop) పెడితే సరుకు చాలా ఈజీగా త్వరగా అమ్ముడైపోతుంది. కానీ డబ్బులు మాత్రం జనాల నుంచి టైంకు రావు. దీంతో ఊర్లో బిజినెస్ లు పెట్టడానికి చాలామంది ఇంట్రెస్ట్ చూపించారు. మీరు మీ ఊర్లో జనాలకు నచ్చే విధంగా మంచి బ్రాండ్స్ డిజైన్స్ తెచ్చి పెడితే కొనుక్కుందానికి వెంటనే వస్తారు. డబ్బుల విషయంలో మొహమాటం లేకుండా ఉంటే ఈ బిజినెస్ సక్సెస్ అవుతుంది. జనరల్ రెడీమేడ్ బట్టల వ్యాపారం పెట్టేందుకు మీ కెపాసిటీ బట్టి పదివేల నుంచి కూడా ఈ బిజినెస్ ను ప్రారంభించుకోవచ్చు

ఫాస్ట్ ఫుడ్ సూపర్ బిజినెస్ :

ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు(Fast food centers) సాధారణంగా పట్టణాల్లో, నగరాల్లో మాత్రమే కనిపిస్తాయి. కానీ ఇప్పుడు పల్లెలకు కూడా విస్తరించాయి. మీ ఊరిలో ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ని మీరు ప్రారంభించినట్లయితే.. టేస్టీగా ఉంటే చాలు.. జనం అంతా మీ దగ్గరికి క్యూ కడుతుంటారు. టేస్ట్, క్వాలిటీ మీద ఫుడ్ బిజినెస్ అనేది చాలా ఆధారపడి ఉంటుంది. ఎంత క్వాలిటీ ఇవ్వగలిగితే అంత ఎక్కువమంది ఈ బిజినెస్ కు రీచ్ అవుతుంటారు. మీకు కుకింగ్ రాకపోయినా టాలెంటెడ్ చెఫ్ ని పెట్టుకున్నట్లయితే.. మీ బిజినెస్ బాగా రన్ అవుతుంది. ఈ వ్యాపారం ద్వారా మీరు నెలకు 50,000 పైగా సంపాదించుకోవచ్చు.

Advertisement

Next Story