ఆ బస్సుతో విడదీయరాని అనుబంధం.. పెళ్లి కూతురులా ముస్తాబు చేసి.. వీడ్కోలు పలికారు.. ఎందుకో తెలుసా?

by Jakkula Mamatha |
ఆ బస్సుతో  విడదీయరాని అనుబంధం.. పెళ్లి కూతురులా ముస్తాబు చేసి.. వీడ్కోలు పలికారు.. ఎందుకో తెలుసా?
X

దిశ,వెబ్‌డెస్క్: ప్రస్తుత సమాజంలో రవాణా వ్యవస్థలో ఎన్ని మార్పులు వచ్చాయో గమనిస్తూనే ఉన్నాం. నిజానికి ఒకప్పుడు ఉన్న రవాణా వ్యవస్థ(Transportation system)తో పోల్చితే ఇప్పుడు చాలా మార్పులు వచ్చాయి. ఒకప్పుడు పల్లెల్లో జీవించే వారు ఆసుపత్రులు(Hospitals), చదువు(education), నిత్యావసర సరుకులు(essential commodities) తదితర కారణాలతో పట్టణంపై ఆధారపడే పరిస్థితులు ఉండేవి. అటువంటి సమయంలో పల్లెలకు బస్సు సౌకర్యం(Bus facility) లేక పల్లె ప్రజలు పడ్డ ఇక్కట్లు వర్ణనాతీతం. కానీ నేటి సమాజంలో ప్రతి గ్రామానికి బస్సు ఫెసిలిటీ ఉంది. ఎక్కడో కొండ ప్రాంతాలు(Hilly areas), అటవీ ప్రాంతాలు(forested areas) మినహాయిస్తే చాలా గ్రామాల్లో బస్సులు అందుబాటులోకి వచ్చాయి.

ఇక గ్రామాల్లో బస్సు వచ్చిందంటే ఆ పల్లె ప్రజల ఆనందం మాటల్లో చెప్పలేం. ఇక ఆ బస్సును కూడా ఒక బంధంగా ఫీల్ అవుతారు. రోజు ఆ బస్సు హారన్ సౌండ్ వింటే ఎంతో సంబరపడి పోతుంటారు. అయితే 15 ఏళ్లుగా నిరంతరం సేవలందించిన ఓ ఆర్టీసీ బస్సుకు తన సేవలు ముగించుకున్నందున్న ఆ పల్లె ప్రజలు ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ అరుదైన ఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గుజార్ వెళ్లే ఆర్టీసీ బస్సుకు గ్రామస్థులు కన్నీటి వీడ్కోలు(Farewell) పలికారు. ఈ అరుదైన ఘటన ధార్వాడ్ జిల్లా కుందగోళ తాలూకాలోని అల్లాపూర్ గ్రామంలో జరిగింది.

పూలు, ముగ్గులతో అందంగా అలంకరించి, పూజలు చేసిన అనంతరం బస్సుకు ఘన వీడ్కోలు(Farewell) పలికారు. ఈ గ్రామానికి 2008 లో మొదటిసారిగా ప్రభుత్వం ఆర్టీసీ బస్సును ప్రారంభించినప్పటి నుంచి ఈ బస్సు అక్కడే సేవలు అందిస్తుంది. గత 15 ఏళ్ల నిరంతర సర్వీస్ అందిస్తూ గ్రామస్థుల కుటుంబంలో ఒకటిగా మారిపోయింది. బస్సు సౌండ్ వినిపిస్తే చాలు చిన్నా పెద్ద ఏమోషన్(Emotional) అయ్యేవారంట. రోజూ సాయంత్రం గ్రామానికి రావడం అక్కడే నైట్ హాల్ చేయడం తిరిగి ఉదయం ప్రయాణికులను ఎక్కించుకుని బయలుదేరడం ఇలా 15 ఏళ్లు గడిచిపోయాయి. అందుకే ఆ బస్సు అంటే గ్రామస్థులకు ఎంతో అభిమానం అంటూ చెబుతున్నారు. అయితే ప్రజెంట్ ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed