బోరుబావిలో పడిన రెండేళ్ల చిన్నారి సురక్షితం

by Y. Venkata Narasimha Reddy |
బోరుబావిలో పడిన రెండేళ్ల చిన్నారి సురక్షితం
X

దిశ, వెబ్ డెస్క్ : రెస్క్యూ టీమ్ ఆపరేషన్ బోరు బావిలో పడిన ఓ రెండేళ్ల చిన్నారి ప్రాణాలు కాపాడగల్గింది. రాజస్థాన్ లోని దౌసలో రెండేళ్ల బాలిక బోరుబావిలో పడింది. 35 అడుగుల లోతులో పడిన బాలికను ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ టీమ్స్ రక్షించాయి. సుమారు 18 గంటల పాటు కొనసాగిన రెస్క్యూ ఆపరేషన్ సక్సెస్ కావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. బోరుబావి నుంచి రక్షించబడిన చిన్నారి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. గత కొన్ని నెలల కాలంలో బోరుబావులలో పడిన చిన్నారులలో చాల వరకు రక్షించబడటం విశేషం. కర్ణాటకలోని ఇండి తాలూకా లచయన్ గ్రామంలో బోరుబావిలో పడిన రెండేళ్ల బాలుడు సాథ్విక్‌ ను, ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం గుండుగోలనుగుంటలో బోరుబావిలో పడిన 9 ఏళ్ల బాలుడు ప్రాణాలతో బయటపడ్డారు. గుజరాత్​లోని జామ్​నగర్​లో ప్రమాదవశాత్తు 15 అడుగుల లోతున్న బోరుబావిలో పడిన రెండేళ్ల బాలుడిని సురక్షితంగా రెస్క్యూ టీమ్ కాపాడింది. బీహార్ లోని నలంద జిల్లా కులూ గ్రామంలో ఆడుకుంటూ బోరు బావిలో పడిన మూడేళ్ల వయస్సు బాలుడిని రెస్క్యూ అధికారులు కాపాడటంలో విజయవంతమయ్యారు.

Advertisement

Next Story

Most Viewed