- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
UPSC 2025 Notification: ఇంజినీరింగ్ సర్వీసెస్ లో.. ఉద్యోగాల భర్తీకి 'యూపీఎస్సీ' నోటిఫికేషన్ రిలీజ్!
దిశ, వెబ్ డెస్క్: యూపీఎస్సీ(Union Public Service Commission) నుంచి ఇంజినీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్-2025 నోటిఫికేషన్(Notification) విడుదలైంది. ఈ ఎగ్జామ్(Exam) ద్వారా డిఫెన్స్ సర్వీస్(Defence service), రైల్వే(Railways), టెలికాం సర్వీస్(Telecom Service) తదితర కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో ఇంజినీరింగ్ ఉన్నత ఉద్యోగాలను యూపీఎస్సీ(UPSC) భర్తీ చేస్తోంది.
మొత్తం పోస్టులు: 232
విభాగాలు:
- ఎలక్ట్రికల్
- సివిల్
- మెకానికల్
- ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్
విద్యార్హతలు: పోస్టును బట్టి బీఈ/బీటెక్/తత్సమాన అర్హతలు కలిగి ఉండాలి.
వయసు: జనవరి 01, 2025 నాటికి 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.
దరఖాస్తు: ఆన్ లైన్ ద్వారా అప్లికేషన్(Application) చేయాలి. అభ్యర్థులు ముందుగా పార్ట్-1, తర్వాత పార్ట్-2 అప్లికేషన్ పూర్తి చేయాల్సి ఉంటుంది.
ఎంపిక: స్టేజ్-1(ప్రిలిమినరీ ఎగ్జామ్) ఎగ్జామ్, స్టేజ్-2(మెయిన్స్ ఎగ్జామ్)ఎగ్జామ్, స్టేజ్-3(పర్సనాలిటీ టెస్ట్), మెడికల్ ఎగ్జామినేషన్, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఎంపిక జరుగుతుంది.
దరఖాస్తు ఫీజు: ఎస్సీ/ఎస్టీ/మహిళలు/పీడబ్ల్యూడీ లకు మినహాయింపు ఉంటుంది. మిగిలిన అభ్యర్థులు రూ.200 చెల్లించాలి.
ఆన్ లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 08-10-2024.
స్టేజ్-1(ప్రిలిమినరీ ఎగ్జామ్) ఎగ్జామ్ నిర్వహణ తేదీ: 09-02-2025.
వెబ్ సైట్: https://www.upsc.gov.in/