- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక చర్యలు
దిశ, వేములవాడ : వేములవాడ రాజన్న దర్శనం కోసం నిత్యం వేలాది మంది భక్తులతో పాటు వాహనాలు వస్తుంటాయని, ఆ రద్దీని దృష్టిలో ఉంచుకొని పట్టణ పరిధిలో ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా పకడ్బందీగా ట్రాఫిక్ నియంత్రణ చర్యలు తీసుకోవాలని స్థానిక పోలీస్ అధికారులకు జిల్లా ఎస్పీ అఖిల్ మహజన్ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు గురువారం వేములవాడ పట్టణ పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆయన అధికారులకు, సిబ్బందికి, నూతనంగా వచ్చిన కానిస్టేబుళ్లకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ స్టేషన్ పరిధిలోని నాంపల్లి, నంది కమాన్, తిప్పాపూర్ బస్టాండ్, కోరుట్ల బస్టాండ్ వంటి కొన్ని ముఖ్య ప్రాంతాలలో ట్రాఫిక్ సమస్యలు తన దృష్టికి రావడం జరిగిందని, ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ నియంత్రణకు, పట్టణ పరిధిలో పలు జంక్షన్ లలో ఉన్న రోడ్డు సంబంధిత ఇబ్బందులను ఇప్పటికే జిల్లా కలెక్టర్ తో పాటు సంబంధిత శాఖల అధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని తెలిపారు.
ఆయా ప్రాంతాల్లో అందరితో కలిసి ముందుకు వెళ్లి ట్రాఫిక్ నియంత్రణకు కృషి చేస్తున్నామని, ప్రస్తుతం ఆర్.ఎస్.ఐ రాజు ఆధ్వర్యంలో కొత్తగా సిబ్బందిని కేటాయించి ట్రాఫిక్ జామ్ ఏర్పడకుండా చర్యలు చేపట్టినట్టు తెలిపారు. స్టేషన్ పరిధిలో పకడ్బందీగా విజిబుల్ పోలీసింగ్ పై ప్రత్యేక దృష్టి పెట్టి క్షేత్ర స్థాయిలో పక్కాగా అమలు చేస్తూ వేములవాడ పట్టణ పరిధిలో స్పెషల్ టీం ఏర్పాటు చేయడంతో పాటు ఐదుగురితో యాక్షన్ టీం ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ఇందులో భాగంగా పట్టణ పరిధిలో 12 లోకేషన్లు గుర్తించి ప్రతి గంటకు ఒకసారి అక్కడి పరిస్థితులను పరిశీలిస్తూ నిరంతరం భద్రత చర్యలను చేపట్టడం జరుగుతుందన్నారు. అట్లాగే పట్టణ పరిధిలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని, రౌడీ షీటర్లు, హిస్టరీ షీటర్ల పై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి వారి కదలికలను ఎప్పటికప్పుడు గమనించాలన్నారు. ఎస్పీ వెంట సీఐలు వీరప్రసాద్, శ్రీనివాస్, ఎస్ఐలు రమేష్, శ్రీనివాస్ ఉన్నారు.