అంబేద్కర్ ఆలోచనా విధానాలు విస్తరింప చేయాలి

by Sridhar Babu |
అంబేద్కర్ ఆలోచనా విధానాలు విస్తరింప చేయాలి
X

దిశ, రామడుగు : గ్రామ గ్రామాన అంబేద్కర్ విగ్రహాలను ఏర్పాటు చేయడంతో పాటు ఆ మహానుభావుని ఆలోచన విధానాలను ప్రతి ఒక్కరికి చేరే విధంగా పాటుపడాలని డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. ఈ సందర్భంగా రామడుగు మండలం షానగర్ గ్రామంలో అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొని పూలమాలలు వేసి నివాళులర్పించారు.

అనంతరం ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పోరాటం చేసి 1950 సంవత్సరంలోనే మహిళలకు సమానత్వం కావాలని కోరినటువంటి గొప్ప వ్యక్తి అని కొనియాడారు. అంతేకాకుండా అంబేద్కర్ విధానం ప్రతి గ్రామంలో విస్తరింప చేయాలని, విగ్రహాలు ఏర్పాటు చేయడంతో పాటు ఆశయ సాధనకు కృషి చేసి అందర్నీ అక్షరాస్యలుగా తీర్చి దిద్దినప్పుడే ఆ మహానుభావుని ఆశ నెరవేరుతుందని సూచించారు.

బీజేపీ ద్వంద విధానం మానుకోవాలి..

భారతీయ జనతా పార్టీ అవలంబిస్తున్న ద్వంద విధానాన్ని మానుకోవాలని కేంద్ర మంత్రిగా ఉన్న అమిత్ షా అంబేద్కర్ విధానాలను తప్పుగా అభివర్ణించడం ఈ దేశానికే కలంకమని, ఇది తీరని మచ్చ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత రాజ్యాంగ నిర్మాత కనబడని దేవుడు కన్నా కనిపించే దేవుడిలా ప్రతి వ్యక్తి ఈరోజు కొనియాడుతుంటే భారతీయ జనతా పార్టీ మాత్రం తమ వైఖరిని నిరూపించుకుందని ఎద్దేవా చేశారు. పార్లమెంటు తమ చేతిలో ఉందని దేశ భవిష్యత్తు కోసం పోరాడిన మహానుభావులను మర్చిపోవడం ఇది దేశానికి ఒక సూచించారు.

మహనీయులకే మహానుభావుడు :మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్

ప్రపంచ దేశాల ముందు భారత దేశాన్ని ఒక అఖండ శక్తిగా నిలబెట్టిన గొప్ప వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మనదేశంలో జన్మించడం గర్వకారణమని మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ అన్నారు.

తన ఆలోచన విధానాలే నేడు గ్రామ గ్రామాలలో విస్తరింప చేస్తున్నారని, ఆయన విధానాలను భవిష్యత్ తరాలకు దిక్సూచిల నిలబెట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పంకిటి శేఖర్, స్వేరో జిల్లా అధ్యక్షుడు పర్లపల్లి మనోజ్ కుమార్, నాగి శేఖర్, కొంపిటి శేఖర్, కలిగేటి కవిత, లక్ష్మణ్, గడ్డం నాగరాజు, కరుణాకర్, అశోక్, సుందరం, రమేష్ పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed