‘కూటమి ప్రభుత్వానికి వడ్డీతో సహా చెల్లిస్తాం’.. మాజీ మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు

by Jakkula Mamatha |
‘కూటమి ప్రభుత్వానికి వడ్డీతో సహా చెల్లిస్తాం’.. మాజీ మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు
X

దిశ,వెబ్‌డెస్క్: ఎన్నికలకు ముందు సీఎం చంద్రబాబు(CM Chandrababu) అరచేతిలో వైకుంఠం చూపారని వైసీపీ నేత, మాజీ మంత్రి ఆర్కే రోజా(Former Minister Roja) ఎద్దేవా చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు నరకం చూపిస్తున్నారని మండిపడ్డారు. ‘రాష్ట్రంలో సంపద సృష్టిస్తానని సీఎం చంద్రబాబు గొప్పలు పలికారు. కానీ అధికారంలోకి వచ్చాక అప్పుల పై అప్పులు చేస్తున్నారు. వైసీపీ నేతలు, కార్యకర్తలను వేధిస్తోన్న కూటమి ప్రభుత్వానికి మేం అధికారంలోకి వస్తే వడ్డీతో సహా చెల్లిస్తాం’ అని ఆమె హెచ్చరించారు. ఈ క్రమంలో మాజీ మంత్రి రోజా పార్టీ ఓటమి పై మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. తప్పు చేసి వైసీపీ ఓడిపోలేదని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వ తప్పుడు ప్రచారం వల్లే ఓడిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో భూమన కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో కుప్పం సహా 14 స్థానాలను కైవసం చేసుకుంటాం అన్నారు. ఆరు నెలల్లోనే ఆలీబాబా అరడజను దొంగల్లా మారారని కూటమి ప్రభుత్వం పై రోజా విమర్శలు గుప్పించారు. జగన్నను(YS Jagan) ఎందుకు ఓడించామనే ప్రశ్చాత్తాపం ప్రజల్లో కనిపిస్తోందని ఆమె వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్ జగన్ భారీ మెజార్టీతో గెలుస్తారని మాజీ మంత్రి రోజా పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed