Ap News: 40కి పైగా కేసులు... నిందితుడి అరెస్ట్

by srinivas |   ( Updated:2024-12-26 10:35:08.0  )
Ap News: 40కి పైగా కేసులు... నిందితుడి అరెస్ట్
X

దిశ, వెబ్ డెస్క్: ఎంతో కాలంగా దొరకకుండా ముప్పు తిప్పలు పెడుతున్న చోరీ నిందితుడు మోహన్‌ను పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో మోహన్‌ చోరీలకు పాల్పడ్డారు. ఇళ్లు, బడులు, గుళ్లు, షాపుల్లో దొంగతనాలకు పాల్పడ్డారు. దీంతో ఆయనపై రాష్ట్రవ్యాప్తంగా 40కి పైగా కేసులు నమోదు అయ్యాయి. దీంతో నిందితుడు కోసం గాలించారు. ఎట్టకేలకు విజయవాడలో అరెస్ట్ చేశారు. నిందితుడు నుంచి రూ. 26 లక్షల విలువైన ఆభరణాలతో పాటు రూ. లక్ష స్వాధీనం చేసుకున్నారు.

Advertisement

Next Story

Most Viewed