- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Amit Shah: బాలాసాహెబ్ ని అవమానించిన వారితోనే ఉన్నారు.. ఉద్ధవ్ ఠాక్రేపై అమిత్ షా విమర్శలు
దిశ, నేషనల్ బ్యూరో: శివసేన (యూబీటీ) అధినేత ఉద్ధవ్ ఠాక్రే (Uddhav Thackeray)పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) నిప్పులు చెరిగారు. మహారాష్ట్ర ఎన్నికల (Maharashtra assembly polls) వేళ బీజేపీ మేనిఫెస్టోను అమిత్ షా విడుదల చేసి మాట్లాడారు. బాలాసాహెబ్, సావర్కర్‌ను అవమానించిన వారికి అండగా ఉద్ధవ్ నిలిచారని మండిపడ్డారు. మహా వికాస్ అఘాడీ కూటమిపై ప్రజలకు నమ్మకం లేదని ఆయన అన్నారు. ‘‘ప్రతిపక్షాలు బుజ్జగింపు రాజకీయాలు చేస్తున్నాయి. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఎన్నికల హామీలు ఇంకా నెరవేర్చలేదు. బాలాసాహెబ్, సావర్కర్‌లను అవమానించిన కాంగ్రెస్ పక్షానే ఉద్ధవ్ ఠాక్రే నిలబడ్డారు. సావర్కర్ గురించి రెండు మంచి మాటలు మాట్లాడాలని రాహుల్ గాంధీని ఉద్ధవ్ ఠాక్రే కోరగలరా? ’’ అని అమిత్ షా పేర్కొన్నారు. ‘‘అయోధ్య రామమందిరం, పౌరసత్వ చట్ట సవరణ, యూనిఫాం సివిల్ కోడ్ ఇలా ఎన్నో అంశాల్లో కాంగ్రెస్ నుంచి వ్యతిరేకత వచ్చింది. అలాంటి వారితో ప్రస్తుతం ఉద్ధవ్ ఉన్నారు. అసత్య హామీలతో లాభం లేదని ఎన్సీపీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్ గుర్తించాలి. యూపీఏ హయాంలో కేంద్రమంత్రిగా పని చేసిన ఆయన.. మహారాష్ట్ర ప్రజల అభివృద్ధి కోసం చేసిన పనులేంటో చెప్పాలి’’ అని డిమాండ్ చేశారు.
మహారాష్ట్ర ఎన్నికలు
ఇకపోతే, మహారాష్ట్రలో నవంబర్ 20న ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ 23న ఫలితాలు రానున్నాయి. ఈ ఎన్నికల్లో మరోసారి అధికారం చేజిక్కించుకోవాలనే లక్ష్యంతో మహాయుతి కూటమి ప్రయత్నిస్తోంది. మరోవైపు.. ఎలాగైనా అధికారాన్ని చేజిక్కించుకోవాలని ఎంవీఏ తీవ్రంగా ప్రయత్నిస్తోంది.