Twitter takes down Pakistan govt's account in India

by srinivas |   ( Updated:2022-10-01 09:08:57.0  )
Twitter takes down Pakistan govts account in India
X

న్యూఢిల్లీ: భారతదేశంలో పాకిస్తాన్ ప్రభుత్వానికి సంబంధించిన ట్విట్టర్ ఖాతాను శనివారం తొలగించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం అభ్యర్థన మేరకే పాకిస్తాన్ ప్రభుత్వం అకౌంట్‌ను భారత్‌లో నిలిపివేసినట్లు ట్విట్టర్ పేర్కొంది. అయితే ట్విట్టర్‌లో జర్నలిస్టుల పోస్టుల తొలగింపు అభ్యర్థనల్లో భారత్ మొదటి స్థానంలో కొనసాగుతోంది. కాగా, 2021 జులై - డిసెంబర్‌లో ట్విట్టర్‌లో ధృవీకరించబడిన జర్నలిస్టులు, వార్తా సంస్థలు పోస్ట్ చేసిన కంటెంట్‌ను తొలగించాలని ప్రపంచవ్యాప్తంగా ట్విట్టర్ ఫిర్యాదులు అందాయి.

కంటెంట్ బ్లాకింగ్ ఆర్డర్‌లను జారీ చేసిన మొదటి ఐదు దేశాల్లో భారత్ నాలుగో స్థానంలో ఉంది. వెరిఫైడ్ జర్నలిస్టులు, న్యూస్ అవుట్‌లెట్ల నుంచి 349 ఖాతాల్లో కంటెంట్‌ను తొలగించడానికి 326 చట్టపరమైన డిమాండ్లకు ట్విట్టర్ లోబడి ఉంది. అయితే గతేడాది జనవరి నుంచి జూన్‌ నెలలో పోలిస్తే ఖాతాల సంఖ్య 103 శాతం పెరిగింది. భారత్ (114), టర్కీ (78), రష్యా (55), పాకిస్తాన్ (48) సమర్పించిన చట్టపరమైన డిమాండ్లే ఖాతాల పెరుగుదలకు కారణమని ట్విట్టర్ వెల్లడించింది.

Advertisement

Next Story

Most Viewed