Syria: సిరియా విషయంలో రష్యా, ఇరాన్ జోక్యం చేసుకోవద్దు

by Shamantha N |
Syria: సిరియా విషయంలో రష్యా, ఇరాన్ జోక్యం చేసుకోవద్దు
X

దిశ, నేషనల్ బ్యూరో: పశ్చిమాసియాలో ఉద్రిక్తతల వేళ ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. సిరియాను (Syria) రెబల్స్ స్వాధీనం చేసుకున్నాయి. ఈనేపథ్యంలో రష్యా (Russia), ఇరాన్‌ (Iran)లకు టర్కీ కీలక సూచనలు చేసింది. ‘డమాస్కస్ రెబల్స్ వశమైంది. మాజీ అధ్యక్షుడు బషర్ అల్ అసద్‌ దళాలకు మద్దతు ఇచ్చే ప్రయత్నం రష్యా, ఇరానియన్లు చేయొద్దు. వారితో మేం చర్చించాం. ఈవిషయాన్ని వారు అర్థం చేసుకున్నారు. 2011లో అంతర్యుద్ధం ప్రారంభమైనప్పటినుంచి మాస్కో, టెహ్రాన్‌లు అసద్‌కు మద్దతుగా నిలిచాయి. ఆ దేశాలు సహాయం చేసినప్పటికీ రెబల్సే గెలిచేవారు. అయితే, ఫలితం మరింత హింసాత్మకంగా ఉండేది’ అని టర్కీ విదేశాంగ శాఖ మంత్రి హకస్‌ ఫిదాన్ పేర్కొన్నారు.

సిరయా రెబల్స్ దాడి

సిరియాలో రెబల్స్ దాడులతో దేశ అధ్యక్షుడు బషర్ అల్ అసద్ (Bashar al Assad) దేశం విడిచి పారిపోవడంతో నాయకత్వ సంక్షోభం తలెత్తింది. సాయుధ రెబల్స్ (Syria rebels) దేశ రాజధాని డమాస్కస్‌తో సహా పలు నగరాలను ఆక్రమించుకున్నారు. దీంతో అసద్‌ తన కుటుంబంతో సహా రష్యాకు పారిపోయారు. ప్రస్తుతం ఆయన మాస్కోలో ఉన్నారు. అధికార బదిలీపై రెబల్స్ తో చర్చలు జరిపాకే అసద్‌ సిరియాను వీడారని రష్యా వెల్లడించింది. ఇక, అసద్‌ సిరియాను వీడిన వెంటనే నియందొరికిందని రెబల్స్ సంబరాలు చేసుకున్నారు.

Advertisement

Next Story

Most Viewed