- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
విద్యార్థిని చితకబాదిన జిల్లా అధికారిణి..
దిశ, సూర్యాపేట టౌన్ : మొబైల్ ఫోన్ చూస్తుందని విద్యార్థిని చితకబాదిన ఘటన సూర్యాపేట బీసీ బాలికల సంక్షేమ వసతి గృహంలో చోటు చేసుకుంది. విద్యార్థులు తెలిపిన వివరాల ప్రకారం సూర్యాపేటలోని వసతి గృహంలో బీసీ సంక్షేమ శాఖ అధికారి విజిట్ చేయడానికి వచ్చారు. అదే సమయంలో సూర్యాపేటలోని పారా మెడికల్ కాలేజీలో మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని మొబైల్ ఫోన్ చూస్తూ ఆఫీసర్ ను గమనించలేదు.
దీంతో ఆ అధికారి నమస్తే పెట్టావా అంటూ ఊగిపోతూ విద్యార్థినిని జుట్టు పట్టుకుని విచక్షణా రహితంగా కొట్టడంతో అక్కడే ఉన్న తోటి విద్యార్థులు వద్దని వారించారు. ఆ పక్కనే ఉన్న వార్డెన్ వచ్చి అధికారిని అక్కడి నుండి పంపించారు.. దాడి చేయడంతో తీవ్రంగా గాయపడిన విద్యార్థినిని సూర్యాపేట ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ కు తరలించారు. ఈ ఘటన పై విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి.. స్టూడెంట్ పై దాడి చేసిన బీసీ సంక్షేమ శాఖ అధికారి పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.