- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కామారెడ్డి మున్సిపాలిటీలో వింత ఘటన..
దిశ, కామారెడ్డి : కామారెడ్డి మున్సిపాలిటీలో వింత ఘటన చోటుచేసుకుంది. మున్సిపాలిటీలో ఆడిట్ చేయడానికి వచ్చిన అధికారులు ఇలా వచ్చి అలా వెళ్లిపోయారన్న విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వచ్చిన అధికారులు కార్యాలయంలో ఆడిట్ చేయకుండానే తిరుగు ప్రయాణం కావడం వెనుక ఉన్న మతలబేంటనే చర్చ మున్సిపల్ వర్గాల్లో కొనసాగుతోంది. ఆడిటర్లు కావాలనే వెళ్లిపోయారా.. లేక బ్రతిమాలి మేనేజ్ చేసి పంపించారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
అసలేం జరిగింది..
కామారెడ్డి మున్సిపల్ కార్యాలయంలో బుధ, గురువారాల్లో స్పెషల్ ఆడిట్ చేయడానికి హైదరాబాద్ నుంచి ఆడిటర్ల బృందం మున్సిపల్ కార్యాలయానికి చేరుకుంది. ఆడిట్ చేయడానికి సంబంధిత రికార్డులు ఇవ్వాలని మున్సిపల్ సిబ్బందిని కోరినా ఇవ్వలేదని తెలుస్తోంది. రెండు రోజుల పాటు కామరెడ్డిలోనే మకాం వేసిన అధికారులు చివరికి ఆడిట్ చేయకుండానే నిజామాబాద్ వెళ్లిపోయినట్టుగా సమాచారం.
మేనేజ్ చేశారని ప్రచారం..?
అయితే ఆడిటర్లు తిరిగి వెళ్ళడానికి ఓ నాయకుడు తెరవెనుక చక్రం తిప్పారన్న చర్చ జరుగుతోంది. రెండు రోజుల పాటు కామారెడ్డిలో మకాం వేసిన ఆడిటర్లను ఆ నాయకుడు పర్సనల్ గా కలిసినట్టుగా తెలుస్తోంది. ఇప్పుడు ఆడిట్ చేయొద్దు.. తర్వాత ఎప్పుడైనా చేయండి.. అని రిక్వెస్ట్ చేసినా అధికారులు వినిపించుకోలేదన్న ప్రచారం సాగుతోంది. దాంతో అధికారులను ఎలాగోలా మేనేజ్ చేసి ఆడిట్ చేయకుండానే తిప్పి పంపారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
రికార్డులు లేకపోవడమే కారణమా..?
అయితే ఆడిటర్లు వచ్చినప్పుడు అధికారులు అడిగిన రికార్డులు లేవని తెలుస్తోంది. గత వర్షాకాలం సీజన్లో కామారెడ్డి పట్టణానికి వచ్చిన నిధులతో రోడ్ల ప్యాచ్ వర్క్స్ చేయకుండానే బిల్లులు తీసుకున్నారన్న ఆరోపణలు అప్పట్లో వినిపించాయి. అయితే సంబంధిత బిల్లులకు సంబంధించి ఎంబీ రికార్డులు చేయకుండానే లక్షల రూపాయలు బిల్స్ చేసి తీసుకున్నారన్న ప్రచారం సాగింది. ఈ నేపథ్యంలో అధికారులు ఆడిట్ చేస్తే అసలు విషయం బయటపడుతుందనే ఆడిటర్లను వెనక్కి పంపారన్న చర్చ సాగుతోంది. ఆడిటర్లు తిరిగి వెళ్లిపోవడం వెనక ఉన్న మతలబు ఇదేనా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. గతంలో ఎన్నడూ ఇలా ఆడిట్ అధికారులు వెనక్కి వెళ్లిన ఘటనలు లేవని, ఇదే ప్రథమమని ప్రచారం సాగుతోంది. ఆడిటర్ల అంశం ప్రస్తుతం కామారెడ్డిలో చర్చనీయాంశంగా మారుతోంది. ఈ విషయం పై ఉన్నతాధికారులు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి.