Manchu Family: అందులో మీడియా ప్రతినిధుల తప్పులేదు.. జర్నలిస్టులపై దాడి ఘటనపై మనోజ్‌ క్లారిటీ

by Gantepaka Srikanth |
Manchu Family: అందులో మీడియా ప్రతినిధుల తప్పులేదు.. జర్నలిస్టులపై దాడి ఘటనపై మనోజ్‌ క్లారిటీ
X

దిశ, వెబ్‌డెస్క్: జర్నలిస్టులపై మోహన్ బాబు(Mohan babu) దాడి ఘటనపై మంచు మనోజ్(Manchu Manoj) వివరణ ఇచ్చారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘నిస్సహాయ స్థితిలో నేను మీడియాను లోపలికి తీసుకెళ్లాను. మా ఇంట్లో అనుమతించకపోవడంతోనే మీడియా ప్రతినిధులను వెంట తీసుకెళ్లాను. లోపలికి వెళ్లాక సడన్‌గా వచ్చి దాడి చేశారు. ఈ ఘటనలో మీడియా వారి తప్పు ఎంతమాత్రం లేదని మంచు మనోజ్(Manchu Manoj ) క్లారిటీ ఇచ్చారు. ఇదిలా ఉండగా.. మోహన్‌ బాబు(Mohan babu), మంచు మనోజ్‌కు మధ్య జరిగిన వివాదం ఎంతటి దుమారం రేపిందో అందరికీ తెలిసిందే.

మంచు ఫ్యామిలీ(Manchu Family) గొడవలను ప్రశ్నించేందుకు డిసెంబర్ 10న మీడియా ప్రతినిధులు జల్పల్లిలోని మోహన్ బాబు నివాసం వద్దకు వెళ్లారు. ఈ క్రమంలో ఓ మీడియా ప్రతినిధిపై మోహన్ బాబు దాడి చేశారు. దీంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. అలాగే పలువురికి గాయాలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించి మోహన్‌బాబుపై హత్యాయత్నం కేసు నమోదు అయ్యింది. అలాగే మోహన్ బాబు దాడి దృశ్యాలు కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Advertisement

Next Story