US Elections: కమలా హ్యారిస్ వర్సెస్ డొనాల్డ్ ట్రంప్

by Shamantha N |
US Elections: కమలా హ్యారిస్ వర్సెస్ డొనాల్డ్ ట్రంప్
X

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికా అధ్యక్ష ఎన్నికలపై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. డెమొక్రటిక్ అభ్యర్థిగా కమలా హ్యారిస్ ఖరారయ్యాక ఆమెతో సంవాదానికి మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ వెనుకడుగు వేశారు. అయితే, ఇప్పుడు ఏకంగా మూడు డిబేట్లలో హ్యారిస్ తో తలపడేందుకు సిద్ధమయ్యారు. సెప్టెంబర్ లో మూడు డిబేట్ లలో పాల్గొనాలని మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భావిస్తున్నారు. ప్రస్తుత ఉపాధ్యక్షురాలు, డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హ్యారిస్ తో మూడు డిబేట్ లలో పాల్గొనేందుకు ప్రతిపాదనను తీసుకొచ్చారు. సెప్టెంబర్ 4, 10, 25 తేదీల్లో టెలివిజన్ నెట్‌వర్క్‌లతో డిబేట్‌లను ఏర్పాటు చేశానని ట్రంప్ చెప్పారు. ఆ చర్చలకు హ్యారిస్ అంగీకరిస్తారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. సెప్టెంబర్ 4న జరిగే డిబేట్ ను ట్రంప్ తో సత్సంబంధాలు ఉన్న ఫాక్స్ న్యూస్ ఏర్పాటు చేయనుంది. సెప్టెంబర్ 10న ఏబీసీ ట్రంప్, హ్యారిస్ మధ్య చర్చకు ఏర్పాట్లు చేసింది. కానీ, చర్చ నుంచి ట్రంప్ వెనక్కి తగ్గారని వార్తలొచ్చాయి. ఇప్పుడు ఇద్దరూ డిబేట్ కు అంగీకరించినట్లు ఏబీసీ నెట్ వర్క్ పేర్కొంది. ఇకపోతే, సెప్టెంబర్ 25న జరిగే డిబేట్ ని ఎన్ బీసీ హోస్ట్ చేయనుంది.

రికార్డు స్థాయిలో నిధుల సేకరణ

కాగా.. దాదాపు 20 రోజుల క్రితం డెమొక్రటిక్ అభ్యర్థిగా కమలా హ్యారిస్ ఖరారయ్యారు. ఆ తర్వాత రికార్డుస్థాయిలో నిధులు సేకరించారు. ట్రంప్ పోలింగ్ ఆధిక్యాన్ని తుడిచిపెట్టిన హ్యారిస్.. పార్టీనేతలు ఆశించినదానికంటే అధికంగా విరాళాలు అందించారు. ఇకపోతే, ఆగస్టు మధ్యలో చికాగోలో నేషనల్ కన్వెన్షన్ జరగనుంది. ఆ తర్వాతే ఈ డిబేట్లు జరగడం గమనార్హం. ఇకపోతే, మార్క్వేట్ యూనివర్శిటీ లా స్కూల్ ఒక సర్వేను విడుదల చేసింది. అందులో హ్యారిస్ ముందంజలో ఉన్నారు. ట్రంప్ కు 47 శాతం మద్దతు ఉండగా హ్యారిస్ జాతీయకు 53 శాతం ఉన్నట్లు నివేదికలు పేర్కొన్నాయి. అధ్యక్ష బరిలో ఉన్నప్పట్నుంచి హ్యారిస్ మీడియా నుంచి ప్రశ్నలు ఎదుర్కోలేదు. దీన్నే సమస్యగా మార్చాలని ట్రంప్ భావిస్తున్నారు.

Advertisement

Next Story