Trump: హోలీ వేడుకల్లో ట్రంప్, ఎలాన్ మస్క్!

by Prasad Jukanti |   ( Updated:2025-03-14 15:17:23.0  )
Trump: హోలీ వేడుకల్లో ట్రంప్, ఎలాన్ మస్క్!
X

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రపంచవ్యాప్తంగా హోలీ సంబరాలు (Holi Celebrations) అంబరాన్ని అంటుతున్నాయి. పిల్లలు పెద్దలు అన్న తేడా లేకుండా ఒకరికొకరు రంగులు చల్లుకుంటూ సందడి చేస్తున్నారు. మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Trump), ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ (Elon Musk) సైతం హోలీ వేడుకల్లో ఎంజాయ్ చేశారు. ఇండియన్ ట్రెడిషనల్ డ్రస్ లో హోలీ రంగులు చల్లుకున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వీరిద్దరు నిల్చున్న ఫోటోను @TrumpUpdateHQ అనే ట్విట్టర్ హ్యాండిల్ లో ఫోస్టు చేయగా హ్యాపీ హోళీ అంటూ నెటిజన్లు కామెంట్స్ ఇస్తున్నారు. ట్రంప్ రాజకీయాలను మరింత కలర్ ఫుల్ చేసే వ్యక్తి అని హ్యాపీ హోలీ ట్రంప్ అంటూ కామెంట్ చేశారు. అయితే ఈ ఫోటో అంతా ఏఐ మాయా అని తెలుస్తోంది. ఏఐ టెక్నాలజీతో ట్రంప్, ఎలాన్ మస్క్ హోలీ ఆడినట్లుగా ఫోటోను రూపొందించి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఇదిలా ఉంటే న్యూజిలాండ్ ప్రదాని క్రిస్టోఫర్ లూక్సాన్ సైతం హోలీ వేడుకల్లో పాల్గొన్నారు. ప్రజలతో కలిసి హోలీ ఆడి వారిని ఉత్సాహపరిచారు.

READ MORE ....

StarLink: ఇచ్చినట్టే ఇచ్చి కండీషన్స్‌ పెడుతున్నారు.. మస్క్‌ స్టార్‌లింక్‌కు ఇండియాలో కఠిన రూల్స్!


Next Story

Most Viewed