Rahul Vs RSS: దేశద్రోహి ఆర్ఎస్ఎస్ ని అర్థం చేసుకోలేడు.. రాహుల్ వ్యాఖ్యలపై కేంద్రమంత్రి ఫైర్

by Shamantha N |
Rahul Vs RSS: దేశద్రోహి ఆర్ఎస్ఎస్ ని అర్థం చేసుకోలేడు.. రాహుల్ వ్యాఖ్యలపై కేంద్రమంత్రి ఫైర్
X

దిశ, నేషనల్ బ్యూరో: ఆర్ఎస్ఎస్ పై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్ అయ్యింది. విదేశాల్లో భారత్ ని అవమానించే అలవాటు రాహుల్ కి ఎప్పట్నుంచో ఉందని కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ ధ్వజమెత్తారు. ‘ ఏదైనా టెక్నాలజీ అందుబాటులో ఉంటే ఆర్‌ఎస్‌ఎస్ పాత్ర గురించి తన అమ్మమ్మను అడిగి తెలుసుకోవాలి. లేదా చరిత్ర పుటలను పరిశీలించాలి సాంకేతికత ఏదైనా ఉంటే.. అలా చేయాలి లేదా చరిత్ర పుటలను పరిశీలించాలి. ఆర్‌ఎస్‌ఎస్‌ని అర్థం చేసుకోవాలంటే రాహుల్ గాంధీకి అనేక జన్మలు ఎత్తాలి. దేశద్రోహి ఆర్‌ఎస్‌ఎస్‌ను అర్థం చేసుకోలేడు. దేశాన్ని విమర్శించేందుకు విదేశాలకు వెళ్లేవారు దాని సారాంశాన్ని గ్రహించలేరు.’ అని రాహుల్ పై విమర్శలు గుప్పించారు. రాహుల్ గాంధీ భారతదేశాన్ని అప్రతిష్టపాలు చేయడానికే విదేశాల్లో పర్యటిస్తున్నట్లు కనిపిస్తోందని అన్నారు. భారత దేశపు విలువలు, సంస్కృతిలో పాతుకుపోయిన ఆర్‌ఎస్‌ఎస్‌ను ఆయన ఈ జన్మలో అర్థం చేసుకోలేరని గిరిరాజ్ సింగ్ అన్నారు.

రాహుల్ గాంధీపై అమిత్ మాల్వియా సెటైర్లు

ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ ఛైర్మన్ సామ్ పిట్రోడా రాహుల్ ని ప్రశంసించారు. అమెరికా టెక్సాస్‌లో ప్రవాస భారతీయులతో జరిగిన సమావేశంలో పిట్రోడా మాట్లాడుతూ.. రాహుల్‌ గాంధీ ‘పప్పు’ కాదని, ఉన్నత విద్యావంతుడు, వ్యూహకర్త అన్నారు. అతను బాగా చదువుకున్నారు. ఏదైనా విషయంపై లోతుగా ఆలోచించే వ్యూహకర్త.. అతన్ని అర్థం చేసుకోవడం అంత సులభం కాదని అన్నారు. దీనిపై బీజేపీ నేత అమిత్ మాల్వియా సెటైర్లు వేశారు. దానికి అమిత్ మాల్వియా బదులిస్తూ.. "రాహుల్ గాంధీని అర్థం చేసుకోవడం కొన్నిసార్లు అంత సులువు కాదని అతని గురువు సామ్ పిట్రోడా చెప్పారు" అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించింది.

Advertisement

Next Story

Most Viewed