- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చట్టం అందరికీ సమానమే.. ప్రధాని మోడీపై ట్రాఫిక్ ఉల్లంఘన కేసు
దిశ, డైనమిక్ బ్యూరో : ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించారంటూ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా కేరళలో ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏప్రిల్ 24న ప్రధాని మోడీ కొచ్చిలో పర్యటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా నిర్వహించిన రోడ్‌షోలో ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన జరిగిందని, త్రిస్సూర్‌కు చెందిన జయకృష్ణన్ అనే వ్యక్తి ఆరోపించారు. ఈ మేరకు బుధవారం కేరళ డీజీపీ అనిల్‌కాంత్, కేరళ రాష్ట్ర మోటారు వాహన శాఖకు కంప్లైంట్ ఇచ్చారు.
రోడ్‌షోలో భాగంగా మోడీ..కారు డోర్‌కు వేలాడుతూ ప్రయాణించారని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాకుండా, రోడ్డు కనిపించకుండా వాహనం అద్దాలపై పూలు చల్లడం కూడా నిబంధనలకు విరుద్ధమేనని తెలిపారు. చట్టం అందరికీ సమానమేనని.. అందరూ నిబంధనలు పాటించాల్సిందేనని జయకృష్ణన్ ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా, ఏప్రిల్ 24 కొచ్చి, ఏప్రిల్ 25న తిరువనంతపురంలో ప్రధాని మోడీ రోడ్ షో నిర్వహించిన సంగతి తెలిసిందే.