దారుణం... వేగంగా వెళ్తున్న కారులోంచి పసికందును బయటకు విసిరేసిన తోటి ప్రయాణికులు

by S Gopi |
దారుణం... వేగంగా వెళ్తున్న కారులోంచి పసికందును బయటకు విసిరేసిన తోటి ప్రయాణికులు
X

దిశ, వెబ్ డెస్క్: వేగంగా వెళ్తున్న కారులోంచి పసికందును తోటి ప్రయాణికులు బయటకు విసిరేశారు. దీంతో ఆ చిన్నారి అక్కడికక్కడే మృతిచెందింది. అంతేకాదు.. ఆ చిన్నారి తల్లిని కూడా కారులోంచి తోసేశారు. ఈ సంఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించి జాతీయ మీడియాలో వచ్చిన కథనం ప్రకారం... మహారాష్ట్రలోని పెల్హర్ నుంచి పోషెర్ కు క్యాబ్ లో ఓ మహిళ తన 10 నెలల పసికందుతో వెళ్తుంది. ఈ క్రమంలో కారులో ఉన్న తోటి ప్రయాణికులు ఆ మహిళను వేధించారు. ఆమె ప్రతిఘటించింది. దీంతో వారు ఆ మహిళ చేతిలో ఉన్న పసికందును వేగంగా వెళ్తున్న కారులోంచి బయటకు విసిరేశారు. దీంతో ఆ పసికందు అక్కడికక్కడే మృతిచెందింది. అంతేకాదు.. పసికందు తల్లిని కూడా కారులోంచి తోశారు. ప్రస్తుతం ఆ మహిళ ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నట్లు అందులో పేర్కొన్నారు.

Advertisement

Next Story