‘‘కాంగ్రెస్ వదిలేయ్.. లేదంటే..’’ బజరంగ్ పూనియాకు బెదిరింపు మెసేజ్

by karthikeya |
‘‘కాంగ్రెస్ వదిలేయ్.. లేదంటే..’’ బజరంగ్ పూనియాకు బెదిరింపు మెసేజ్
X

దిశ, వెబ్‌డెస్క్: ఈ మధ్యనే కాంగ్రెస్ పార్టీలో చేరిన ప్రముఖ రెజ్లర్, కిసాన్ కాంగ్రెస్ వర్కింగ్ చైర్మన్ బజరంగ్ పూనియా (Bajrang Punia)కు బెదిరింపు వాట్సాప్ మెసేజ్ వచ్చినట్లు తెలుస్తోంది. గుర్తు తెలియని విదేశీ నంబర్ నుంచి.. ‘బజరంగ్‌, కాంగ్రెస్‌ని వీడి వెళ్లండి.. లేకపోతే మీకు, మీ కుటుంబానికి మేలు జరగదు.. ఇదే మా చివరి సందేశం.. ఎన్నికలకు ముందు మా సంగతి ఏంటో చూపిస్తాం. మీకు కావలసిన చోట ఫిర్యాదు చేయండి. ఇది మా మొదటి, చివరి హెచ్చరిక.” అని తనకు బెదిరింపు మెసేజ్ వచ్చినట్లు బజరంగ్ తెలిపారు. ఈ మేరకు సోనిపట్ బహల్‌ఘర్ పోలీస్ స్టేషన్‌ (Sonipat Bahalghar Police Station)లో ఫిర్యాదు కూడా చేశారు. పోలీసులు కూడా ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలోనే బెదిరింపులకు పాల్పడిన వ్యక్తిని గుర్తించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని, భజరంగ్, ఆయన కుటుంబ సభ్యుల భద్రత కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశామని పోలీసులు తెలిపారు.

ఇదిలా ఉంటే ప్రముఖ రెజర్లు వినేష్ ఫోగట్ (Vinesh Phogat), బజరంగ్ పూనియాలు ఈ మధ్యనే కాంగ్రెస్ పార్టీ (Congress Party)లో చేరిన విషయం తెలిసిందే. అక్టోబర్‌లో హర్యానా అసెంబ్లీ ఎన్నికలు (Haryana Assembly Elections) జరగనుండగా.. వరసగా గత రెండుసార్లుగా అధికారంలో ఉన్న బీజేపీ (BJP) మరోసారి అధికారం దక్కించుకోవాలని ప్రయత్నిస్తుంటే, ఈసారి ఎలాగైనా బీజేపీని ఓడించి హర్యానాలో గెలుపు జెండా ఎగరేయాలని కాంగ్రెస్ బలంగా ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో బజరంగ్, ఫోగట్‌లు కాంగ్రెస్‌లో చేరడం ఆ పార్టీకి కలిసొచ్చే అంశంగా మారింది.

Advertisement

Next Story

Most Viewed