- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Himachal Pradesh: జూనియర్‌పై ర్యాగింగ్‌కు పాల్పడిన ముగ్గురు విద్యార్థుల అరెస్ట్
దిశ, నేషనల్ బ్యూరో: హిమాచల్ ప్రదేశ్‌లోని సోలన్ జిల్లాలో ఓ ప్రైవేట్ యూనివర్శిటీకి చెందిన ముగ్గురు విద్యార్థులు ఎంబీఏ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిపై ర్యాగింగ్‌కు పాల్పడగా, ఆ ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. అరెస్టయిన వారు జమ్మూకశ్మీర్‌లోని ఉధంపూర్‌కు చెందిన కరణ్ డోగ్రా (19), హిమాచల్ ప్రదేశ్‌లోని మండికి చెందిన చిరాగ్ రాణా (19), హమీర్‌పూర్‌కు చెందిన దివ్యాన్ష్ (19).
శనివారం రాత్రి బాధితుడు రజిత్ కుమార్ రూమ్‌కు సీనియర్లు వెళ్లి తమ రూమ్‌కు రావాలని ఆదేశించగా, అందుకు అతను నిరాకరించడంతో బలవంతంగా గదిలోకి తీసుకెళ్లి, తాళం వేసి మద్యం తాగమని బలవంతం చేశారు, అందుకు అతను నిరాకరించడంతో, బెల్టుతో తీవ్రంగా కొట్టారు. దీనిపై అతను పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు విచారణ జరిపి ర్యాగింగ్‌కు పాల్పడిన ముగ్గరు సీనియర్ విద్యార్థులను అరెస్ట్ చేశారు. మరోవైపు బాధితునిపై బెల్ట్‌తో దాడి చేసిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది.
పోలీసులకు ఫిర్యాదు చేయడానికి ముందు అతను యూనివర్సిటీ ర్యాగింగ్ నిరోధక కమిటీకి ఫిర్యాదు చేయగా, విచారణ చేపట్టి వారిని యూనివర్సిటీ నుంచి బహిష్కరించారు. బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు తాజాగా వారిని అరెస్టు చేశారు. నిందితులపై భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 115(2), సెక్షన్ 127(2), రాష్ట్ర విద్యా సంస్థల (ర్యాగింగ్ నిషేధం) చట్టం 2009లోని సెక్షన్ 3 కింద కేసు నమోదు చేశారు. తదుపరి విచారణ కొనసాగుతోందని ఎస్పీ సోలన్ గౌరవ్ సింగ్ తెలిపారు.