- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Farooq Abdullah : పాకిస్తాన్ జిందాబాద్ నినాదాలు చేసినవాళ్లు బీజేపీతో చేతులు కలుపుతున్నారు : ఫరూఖ్ అబ్దుల్లా
దిశ, నేషనల్ బ్యూరో : గతంలో ‘పాకిస్తాన్ జిందాబాద్’ నినాదాలు చేసిన వాళ్లు.. ఇప్పుడు బీజేపీతో చేతులు కలుపుతున్నారని నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ చీఫ్ ఫరూఖ్ అబ్దుల్లా ఆరోపించారు. సరిగ్గా అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే బారాముల్లా ఎంపీ (స్వతంత్రుడు), ఇంజినీర్ అబ్దుల్ రషీద్‌ను ఎందుకు విడుదల చేశారని బీజేపీని ఆయన ప్రశ్నించారు. కశ్మీర్‌లో బీజేపీ, ఆర్ఎస్ఎస్‌లకు రషీద్ మిత్రపక్షంగా మారబోతున్నాడని విమర్శించారు. కశ్మీరీ ముస్లింలను విభజించి, వారి వాణి వినిపించకుండా చేసే టాస్క్‌ను అబ్దుల్ రషీద్‌కు బీజేపీ అప్పగించిందని ఫరూఖ్ అబ్దుల్లా పేర్కొన్నారు.
‘‘ఆర్టికల్ 370 వల్లే కశ్మీర్‌లో ఉగ్రవాదం ప్రబలిందని బీజేపీ వాళ్లు చెబుతుంటారు. ఆర్టికల్ 370ని రద్దు చేసి ఐదేళ్లయింది. అయినా ఉగ్రదాడులు ఎందుకు కొనసాగుతున్నాయి ? టెర్రరిస్టులకు ఆయుధాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి ?’’ అని ఆయన ప్రశ్నించారు. ‘‘కశ్మీర్‌లో వేర్పాటువాదులను తయారు చేసింది ఇక్కడి పార్టీలు కాదు.. పాకిస్తానే’’ అని ఫరూఖ్ అబ్దుల్లా స్పష్టం చేశారు.