- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ పార్టీలు బుజ్జగింపుల ఊబిలో చిక్కుకున్నాయి: ప్రధాని మోడీ విమర్శలు
దిశ, నేషనల్ బ్యూరో: సమాజ్ వాదీ పార్టీ(ఎస్పీ), కాంగ్రెస్ పార్టీలు బుజ్జగింపుల ఊబిలో చిక్కుకున్నాయని ప్రధాని నరేంద్ర మోడీ విమర్శించారు. అంతేగాక ఈ రెండు పార్టీలు పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పై నిరంతరం అసత్యాలు ప్రచారం చేస్తు్న్నారని ఆరోపించారు. ఉత్తరప్రదేశ్‌లోని ఆజంగఢ్‌లో గురువారం నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో మోడీ ప్రసంగించారు. ఎస్పీ కాంగ్రెస్‌లది ఒకటే దుకాణమన్నారు. వారు అబద్ధాల వస్తువులను అమ్ముతారని, బంధుప్రీతి, అవినీతిని పోత్రహిస్తారని ఆరోపించారు. ‘భారతదేశంలో ప్రజాస్వామ్య పండుగకు సంబంధించిన వార్తలు ప్రపంచంలోని వార్తాపత్రికలలో మొదటి పేజీలో రావడం నేను మొదటిసారి చూస్తున్నాను. దీని ద్వారా భారతదేశ గుర్తింపు ప్రపంచానికి ఎంత ప్రాముఖ్యతనిస్తుందో అర్థం చేసుకోవచ్చు’ అని తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ మహాత్మాగాంధీ పేరు పెట్టుకుని అధికారంలోకి వస్తారని, కానీ వారికి గాంధీ మాటలు గుర్తుండవని మండిపడ్డారు. ‘పొరుగు దేశాల్లో నివసిస్తున్న మైనారిటీలు భారతదేశానికి వచ్చేలా మహాత్మా గాంధీ స్వయంగా హామీ ఇచ్చారు. గత 70 ఏళ్లలో వేలాది కుటుంబాలు తమ సంస్కృతిని, మతాన్ని కాపాడుకునేందుకు భారత్‌లో ఆశ్రయం పొందాయి’ అయితే అవి కాంగ్రెస్‌కు ఓటు బ్యాంకు కానందున వారి గురించి ఆలోచించలేదు’ అని వ్యాఖ్యానించారు. ఎస్పీ, కాంగ్రెస్‌లు సీఏఏపై అసత్య ప్రచారం చేసి దేశాన్ని అల్లర్ల వైపు నెట్టేందుకు ప్రయత్నించాయన్నారు. సీఏఏతో పౌరసత్వం కల్పించే పని ఇప్పటికే ప్రారంభమైందని, దానిని ఎవరూ అడ్డుకోలేరని స్పష్టం చేశారు.