వారు సీజనల్ హిందువులు: కాంగ్రెస్ పై కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ ఫైర్

by samatah |
వారు సీజనల్ హిందువులు: కాంగ్రెస్ పై కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ ఫైర్
X

దిశ, నేషనల్ బ్యూరో: ఈ నెల 22న జరిగే అయోధ్య ప్రాణ ప్రతిష్ట వేడుకలకు హాజరుకావడం లేదని కాంగ్రెస్ ప్రకటించిన నేపథ్యంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి విమర్శలు గుప్పించారు. ‘వారు సీజనల్ హిందువులు. కేవలం ఓట్ల సమయంలోనే స్వచ్ఛమైన హిందువులుగా మారడానికి ప్రయత్నిస్తారు. నెహ్రూ అనంతరం ఎవరూ అయోధ్యకు వెళ్లలేదు. అయోధ్య కేసును కావాలనే కాంగ్రెస్ పెండింగ్‌లో ఉంచింది. కాబట్టి వారికి అయోధ్యకు వెళ్లే నైతిక హక్కు లేదు’ అని విమర్శించారు. మరోవైపు మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సైతం కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు. ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి అందిన ఆహ్వానాన్ని కాంగ్రెస్ తిరస్కరించడం అంటే.. భారత్ దేశ గుర్తింపు, సంస్కృతిని పక్కనబెట్టడమే అని తెలిపారు. ఇలాంటి వాటి వల్లే కాంగ్రెస్ పరిస్థితి దిగజారిందని అన్నారు. కాగా, రాయాలయం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఆర్ఎస్ఎస్, బీజేపీ కార్యక్రమంగా అభివర్ణిస్తూ వేడుకకు హాజరుకావట్లేదని కాంగ్రెస్ వెల్లడించింది.

Advertisement

Next Story

Most Viewed