- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎలక్టోరల్ బాండ్ల ద్వారా విరాళాలిచ్చిన తెలుగు కంపెనీలివే
దిశ, నేషనల్ బ్యూరో : ఎన్నికల బాండ్ల ద్వారా రాజకీయ పార్టీలు సేకరించిన విరాళాల చిట్టా ఎట్టకేలకు బయటకు వచ్చింది. రాజకీయ పార్టీలకు విరాళాలను అందించిన సంస్థల లిస్టులో మన తెలుగు రాష్ట్రాలకు చెందిన చాలా కంపెనీలే ఉన్నాయి. అవేంటో ఓ సారి చూద్దాం.. పీవీ క్రిష్ణారెడ్డికి చెందిన మేఘా ఇంజినీరింగ్ కంపెనీ ఈ లిస్టులో ఉంది. వెస్టర్న్ యూపీ పవర్ ట్రాన్స్‌మిషన్ కంపెనీ కూడా పార్టీలకు విరాళాలు ఇచ్చింది. మేఘా ఇంజనీరింగ్ సంస్థ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ పి.ఆర్.రెడ్డి.. ఈ కంపెనీ బోర్డులో డైరెక్టర్‌గా ఉండటం గమనార్హం. తెలంగాణ పారిశ్రామిక దిగ్గజం జూపల్లి రామేశ్వర్ రావుకు చెందిన మై హోం ఇన్‌ఫ్రా కూడా దాతల లిస్టులో ఉంది. హైదరాబాద్‌లో ప్రఖ్యాతి గడించిన అపర్ణ ఫామ్స్ అండ్ ఎస్టేట్స్ కూడా విరాళం ఇచ్చింది.
హైదరాబాద్ ఫార్మా దిగ్గజాలు..
ఫార్మా రంగానికి చెందిన డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్, ఫార్మా దిగ్గజం సత్యనారాయణరెడ్డికి చెందిన ‘ఎంఎస్ఎన్ ఫార్మా కెమ్’, ఎంఎస్ఎన్ లేబొరేటరీస్ కూడా దాతల లిస్టులో ఉన్నాయి.తెలుగు పారిశ్రామికవేత్త వెంకయ్యచౌదరి నన్నపనేనికి చెందిన నాట్కో ఫార్మా నుంచి కూడా విరాళాలు అందాయి. హైదరాబాద్ కేంద్రంగా వ్యాక్సిన్లు తయారు చేసే భారత్ బయోటెక్ లిమిటెడ్ సైతం విరాళాలను అందించింది. తెలంగాణ, ఏపీ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించే వరుణ్ మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఛైర్మన్ వల్లూరుపల్లి ప్రభుకిశోర్ కూడా దాతల జాబితాలో ఉన్నారు. షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ కంపెనీ ప్రమోటర్లు విశ్వేశ్వర రెడ్డి, కె.రవికుమార్ రెడ్డిలకు ఏపీ సీఎం జగన్‌కు సన్నిహితులుగా పేరుంది. ఈ కంపెనీ కూడా విరాళాలు ఇచ్చింది. హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే శ్రీ సిద్ధార్థ్ ఇన్ ఫ్రా టెక్ అండ్ సర్వీసెస్ కూడా దాతల లిస్టులో ఉంది. పొనుగోటి హేమేందర్ రావు అనే ఓ దాత కూడా కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన జాబితాలో ఉన్నారు.