- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఈ ఎన్నికల్లో గెలిచిన యువ ఎంపీలు వీళ్లే!.. వీరి వయసు తెలుసా?
దిశ, డైనమిక్ బ్యూరో: పార్లమెంట్ ఎన్నికల ఫలితాల్లో భాగంగా ఈ సారి నలుగురు యువ ఎంపీలు పార్లమెంట్ మెట్లు ఎక్కనున్నారు. దేశవ్యాప్తంగా మంగళవారం విడుదల అయిన ఫలితాలు ఎక్జిట్ పోల్స్ అంచనాలను తారుమారు చేశాయి. ఈ ఫలితాల్లో ఈ సారి కొత్తగా చాలా మంది పార్లమెంట్ కు వెళ్లనున్నారు. అందులో నలుగురు ఎంపీలు 25 ఏళ్లకే పార్లమెంట్ లో అడుగుపెట్టనున్నారు. వీరిలో పుష్పేంద్ర సరోజ్, ప్రియా సరోజ్ సమాజ్ వాదీ పార్టీ నుంచి గెలుపొందగా.. మరో ఇద్దరు శాంభవి చౌదరీ, సంజన జాతవ్ లు లోక్ జనశక్తి, కాంగ్రెస్ పార్టీల నుంచి విజయం సాధించారు. వీరిలో శాంభవి చౌదరి, పుష్పేంద్ర సరోజ్, ప్రియా సరోజ్ లు రాజకీయ వారసత్వంలో భాగంగా గెలుపొందగా.. సంజన జాతవ్ మాత్రం ఎటువంటి పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ లేకుండా నెగ్గారు.
ఇందులో శాంభవి చౌదరి బీహార్ మంత్రి అశోక్ చౌదరి కుమార్తె. ఈమె సమస్తిపూర్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ నేత సన్నీ హజారీపై విజయం సాధించారు. మరో ఎంపీ పుష్పేంద్ర సరోజ్ ఐదుసార్లు ఎమ్మెల్యే, ఉత్తరప్రదేశ్ మాజీ మంత్రి అయిన ఇంద్రజిత్ సరోజ్ కుమారుడు. ఈయన బీజేపీ ఎంపీ వినోద్ కుమార్ సోన్కర్ పై లక్ష మెజారిటీతో గెలుపొందారు. ప్రియా సరోజ్ మూడుసార్లు ఎంపీగా ఎన్నికైన తూఫాని సరోజ్ కుమార్తె. ఈమె మచ్లిషహర్ పార్లమెంటరీ స్థానంలో బీజేపీ సిట్టింగ్ ఎంపీ భోలానాథ్‌పై 35,850 ఓట్ల తేడాతో భారీ విజయం సాధించారు. ఇక సంజన జాతవ్ రాజస్థాన్ పోలీస్ కానిస్టేబుల్ అయిన కప్తాన్ సింగ్ భార్య. ఈమె 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 409 ఓట్ల తేడాతో బీజేపీ అభ్యర్థి రమేష్ ఖేడీ చేతిలో ఓడిపోగా.. ఇప్పుడు 51,983 ఓట్ల తేడాతో బీజేపీ అభ్యర్థి రామ్‌స్వరూప్ కోలీపై విజయం సాధించారు.