నడిరోడ్డుపై అమ్మాయి మెడపట్టుకుని కారులోకి లాకెళ్లిన యువకుడు.. (వీడియో)

by Hamsa |
నడిరోడ్డుపై అమ్మాయి మెడపట్టుకుని కారులోకి లాకెళ్లిన యువకుడు.. (వీడియో)
X

దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుతం సమాజంలో మహిళలకు భద్రత లేదు. కొంత మంది కీచకులు అందరూ చూస్తుండగానే మహిళలపై దారుణాలకు పాల్పడుతున్నారు. అమ్మాయిల విషయంలో విచక్షణ కోల్పోయి ప్రవర్తిస్తున్నారు. ఎన్ని కఠిన చర్యలు తీసుకువచ్చినా అమ్మాయిలపై దాడులు ఆగడం లేదు. నిత్యం ఎక్కడో ఒకచోట ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా, ఢిల్లీలో ఓ యువకుడు నడిరోడ్డుపై ఓ అమ్మాయిని మెడ పట్టుకుని లాకెళ్లి కారులో ఎక్కించి ఆమెపై దాడి చేశాడు.

వివరాల్లోకి వెళితే.. ఢిల్లీలోని మంగోల్ ఫ్లై ఒవర్‌పై వద్ద ట్రాఫిక్ సిగ్నల్ పడటంతో వాహనం ఆగింది. అందులోంచి ఓ యువతి దిగి పారిపోతుండగా.. ఓ యువకుడు ఆమె వెనకాలే వెళ్లాడు. ఆమెను మెడ పట్టుకుని కారు వద్దకు లాకెళ్లి కారులో నూకేశాడు. ఆ తర్వాత యువతిని దాడి చేశాడు. అక్కడ అతడితో పాటు ఇద్దరు యువకులు ఉన్నారు. అనంతరం అమ్మాయిని తీసుకుని ముగ్గురు క్యాబ్‌లో అక్కడి నుంచి వెళ్లిపోయారు. అది గమనించి ఓ వ్యక్తి జరిగిందంతా వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అది కాస్త వైరల్ కావడంతో పోలీసులు చూసి ఈ ఘటనపై కేసు నమోదు చేసి వీడియో ఆధారంగా నిందితుల కోసం గాలిస్తున్నారు.

Next Story

Most Viewed