ఇండియా కూటమి విజయం ఖాయం.. రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గెహ్లాట్

by samatah |
ఇండియా కూటమి విజయం ఖాయం.. రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గెహ్లాట్
X

దిశ, నేషనల్ బ్యూరో: ప్రస్తుతం జరుగుతున్న లోక్ సభ ఎన్నికల్లో రాజస్థాన్‌లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలు గెలుచుకుంటుందని ఆ రాష్ట్ర మాజీ సీఎం అశోక్ గెహ్లాట్ దీమా వ్యక్తం చేశారు. అంతేగాక కేంద్రంలో ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పడుతుందని తెలిపారు. సోమవారం ఆయన ఓ ఇంటర్వూలో భాగంగా మాట్లాడారు. మోడీ మాయల మాటలు ప్రస్తుత ఎన్నికల్లో పని చేయవని ఆయన వ్యాఖ్యలన్నీ అబద్దాలకే పరిమితం అయ్యాయనే విషయం ప్రజలకు ఇప్పటికే స్పష్టంగా అర్ధమైందని తెలిపారు. మొదటి మూడు దశల్లోనే ఇండియా కూటమి విజయం ఖాయమైందన్నారు.

2014, 2019 లోక్‌సభ ఎన్నికల్లోనూ అబద్ధాలతో బీజేపీ విజయం సాధించిందనిఆరోపించారు. బీజేపీ 400 సీట్లు ఎందుకు అడుగుతుందో స్పష్టమైందన్నారు. ‘బీజేపీ రాజ్యాంగాన్ని ధ్వంసం చేస్తోంది. ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది. ఎలక్టోరల్ బాండ్లలో పెద్ద స్కాం తెరపైకి వచ్చింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, సీబీఐలు దుర్వినియోగం అయ్యాయి. వీటన్నింటినీ ప్రజలు గమనిస్తున్నారు’ అని వ్యాఖ్యానించారు. బీజేపీ వేసిన ఎత్తుగడలన్నీ ప్రజలను తమ వైపునకు తిప్పాయని తెలిపారు. ఇండియా కూటమికి వచ్చే సీట్ల సంఖ్యను తాను అంచనా వేయలేనని కానీ ప్రజలు మాత్రం మార్పు కోరుకుంటున్నారని వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed