- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Puri Jagannath: పూరీ జగన్నాథుని రహస్య గది తెరిచేందుకు ముహూర్తం ఖరార్.. ఎప్పుడంటే..?
దిశ వెబ్ డెస్క్: దశాబ్ధాలుగా ఎదురుచూస్తున్న పూరీ జగన్నాథుని రత్న భాండాగారం తలుపు తెరుచుకోనున్నాయి. దాదాపు 55 ఏళ్ల నుండి మూసిఉన్న మూడో గదిని ఈ నెల 14న రత్నభాండాగారాన్ని తెరవాలని రత్నభాండ పర్యవేక్షణ కమిటీ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదించింది.
ఈ నేపథ్యంలో కమిటీ చైర్మన్ జస్టిస్ వష్నాథ్ రథ్ మీడియాతో మాట్లాడుతూ.. జులై 14న రత్నభాండాగారాన్ని తెరిపించేందుకు ప్రభుత్వం అనుమతి ఇస్తుందని ఆశిస్తున్నామని అన్నారు.అలానే ప్రభుత్వం నుంచి అనుమతి లభించిన తర్వాత కీలక పనులు ప్రారంభిస్తామని, రత్నభాండాగారం తెరవబడుతుందని పేర్కొన్నారు.
రత్నభాండాగారం అంటే ఏంటి..?
పూర్వం రాజలు జగన్నాథునికి విలువైన కానుకలను సమర్పించేవారు. వాటిని ఆలయ అధికారులు భద్రంగా దాచిన చోటునే రత్న భాండాగారం అని పిలుస్తున్నారు. కాగా పూరీ ఆలయం కింద భాగంలో ఉత్తర దిక్కులో ఈ రత్న భాండాగారం ఉంది. కాగా ఇది మూడు గదులుగా విభజింపబడి ఉంటుంది. కొన్ని నివేధికల ప్రకారం.. మొదటి గదిలో స్వామి వారి విలువైన వస్తువులు ఉన్నాయి.
ఇక రెండో గదిని బాహర్ బండార్ అని పిలుస్తారు. దీనిలో స్వామి వారి నిత్య పూజలకు సంబంధించిన వస్తువులు ఉంటాయి. అలానే మూడవ గదిని బితర్ బండార్ అని పిలుస్తారు . ఇందులోనే గతంలో రాజలు స్వామి వారికి సమర్పించిన అంతులేని నిధి దాగి ఉంది. అయితే ఈ గది తాలాలు గతంలో కనిపించకుండా పోయాయి. మూడో గదిని తెరవాలంటే ఆ గది తాళాం చెవితోపాటు మిగిలిన రెండు గదుల తాళాంచెవులు ఉండాలి. అంటే మూడు తాళాంచెవులు ఉంటేనే తెరవగలం. ఈ నేపథ్యంలో స్వామి వారి సంపధ భద్రంగానే ఉందా..? లేదా అనే అనుమానాలు భక్తుల్లో రేకెత్తుతున్నాయి.
వెల కట్టలేని అపార సంపద.. 1978లో చివరిసారిగా తెరుచుకున్న తలుపులు..
ఆలయంలోని నివేధికల ప్రకారం.. రత్నభాండాగారంలోని మూడో గదిని పలుమార్లు తెరిచారు. బ్రిటీష్ వాళ్లు భారతదేశాన్ని పరిపాలించిన సమయంలో 1925లో ఒక సారి ఈ రత్న భాండాగారాన్ని తెరిచారు. ఈ నేపథ్యంలో అందులో ఉన్న సంపధను లెక్కించేందుకు యత్నించారు. అయితే అందులో ఉన్న సంపధ విలువను లెక్కకట్టలేకపోయారు. అలానే 1978లో మరోసారి రత్నభాండాగారాన్ని తెరిచారు.
దేశం నలుమూలల పేరుగాంచిన నిపుణులను పిలిపించి లెక్కించేందుకు యత్నించారు. అయితే వాటి విలువను ఆ నిపునులు సైతం చెప్పలేక పోయారు. స్వచ్చమైన బంగారం, వజ్రాలు, కెంపులు, పచ్చలు కుప్పలు తెప్పలుగా ఉన్నాయి. 100 తులాల పైబడిన ఆభరణాలు ఉన్నాయి. కాగా వాటిలో కొంత భాగాన్నే లెక్కించగలిగారు. అనంతరం స్వామివారి నిధి నిక్షిప్తమై ఉన్న మూడో గది తాళాచెవి కనిపించకుండా పోయింది.
ఈ నేపథ్యంలో స్వామి వారి సంపధ భద్రంగానే ఉందా..? అనే అనుమానం అందరిలోనూ నెలకొంది. ఇక 1985లోనే ఈ రత్నభాండాగారాన్ని తెరిచారు. ఆ సమయంలో ఉన్న రెండు తాళాంచెవులతో మూడోగదిని తెరిచేందుకు యత్నంచారు. కాని ఆ ప్రయత్నం ఫలించలేదు.
నివేధికలను తొక్కిపెట్టిన ప్రభుత్వం..
అసలు ఆ తాళాం చెవి ఏమైందనే విషయాన్ని తెలుసుకునేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేశారు. అయితే ఆ కమిటీలో జరిగిన అవకతవకల కారణంగా కొంతకాలం ఈ విషయంపై ఎలాంటి నివేధికలు ప్రభుత్వానికి అందలేదు. అనంతరం కమిటీ నివేధికలు అందించినా అప్పటి ప్రభుత్వం వాటిని తొక్కిపెట్టింది. అలా ఎందుకు చేసిందనే విషయంపై స్పష్టతలేదు. అయితే ఇటీవల జరిగిన ఎన్నికల ప్రచారంలో మోడి సైతం ఈ విషయంపై మాట్లాడారు.
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే జగన్నాథుని మూడోగదని తెరిచేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం బీజేపీ ప్రభుత్వం మూడో గదిని తెరిచేందుకు సన్నాహాలు చేస్తోంది. అప్పటి వరకు ఉన్న కమిటీని రద్ధు చేసి కొత్త కమిటీని మోడీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కాగా జస్టిస్ వష్నాథ్ రథ్ నేతృత్వం వహిస్తున్నారు. ఈయన పర్యవేక్షణలో మూడోగది డూప్లికేట్ తాళాంచెవి కలక్టరేట్‌లో ఉన్నట్టు తెలిసింది. దాన్ని సాయంతో మూడోగదిని తెరవనున్నారని సమాచారం.
పద్మనాభునికి జగన్నాథునికి మధ్య సారూప్యత..
భారత దేశంలో ఎన్నో పుణ్యక్షేత్నాలు ఉన్నాయి. వాటిలో పూరీ జగన్నాథ స్వామి ఆలయం సైతం ఒకటి. కేరళలోని పద్మనాభ స్వామికి పూరీ జగన్నాథునికి సారూప్యత ఉందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పద్మనాభుని నేల మాలిగల్లో ఒకటైన 6వ గదికి నాగబంధం ఉంది. దీనితో దాన్ని తెరిస్తే ప్రళయం వస్తుందనే భక్తుల నమ్మకం. ఈ కారణంగానే ఆ గదిని తేరవలేదు. దీనితో ఆ గదిలో ఏముంది అనేది ఓ ప్రశ్నగానే మిగిలింది.
కాని జగన్నాథుని రత్నభాండాగారంలోని మూడవ గది గతంలో పలుమార్లు తెరవబడింది. అందులో ఏముందో అందరికీ తెలుసు. అయితే ప్రస్తుతం ఆ గదికి సంబంధించి ఓ ప్రచారం జోరుగా సాగుతోంది. జగన్నాథుని మూడోగది నుండి పాములు బుసకొడుతున్నట్టు శబ్ధం వస్తోందని అక్కడి పూజార్లు అంటున్నారు. అలానే ఆ గదిని తెరిస్తే ప్రళయం వస్తుందని, దేవుని రహస్యాలు తెలుసుకోవాలి అని అనుకుంటే దేశానికి మంచిదికాదని భయపెడుతున్నారు.
ఆ నిధిని ఖాజేయాలని ఎవరో అనుకుంటున్నారని, అందుకే ఆ ఆధిశేషుడే నిధికి కాపలా కాస్తున్నాడని కొందరు భక్తులు సైతం నమ్ముతున్నారు. మరికొందరు ఆ గదిని చాలా కాలంగా తెరవకపోవడంతో లోపల పాములు చేరి ఉండవచ్చిని అంటున్నారు. కాగా ఈ గుడి బాధ్యతలు వంశపారపర్యంగా వస్తున్నాయి. ఒక వంశానికి చెందిన వారే 800 ఏళ్లుగా ఈ గుడిలో అర్చకులుగా, ఉభయకర్తలుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆ అర్చకులే మూడో గది గురించి భయాంధోళనలకు గురిచేయడం ప్రస్తుతం అందరిలో అనుమానాలను రేకెత్తిస్తోంది.