నీట్ రీ ఎగ్జామ్ ఫలితాలు విడుదల.. ర్యాంకుల్లో మార్పులు

by Shamantha N |   ( Updated:2024-07-01 05:38:14.0  )
నీట్ రీ ఎగ్జామ్ ఫలితాలు విడుదల.. ర్యాంకుల్లో మార్పులు
X

దిశ, నేషనల్ బ్యూరో: నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ.. నీట్ రీ ఎగ్జామ్ ఫలితాలను ప్రకటించింది. నీట్ యూజీ-2024 అభ్యర్థుల ర్యాంకులను ఎన్టీఏ సవరించింది. 1563 మంది అభ్యర్థుల ర్యాంకులను సవరించి నీట్ ఫలితాలు ప్రకటించింది. ఈ మేరకు నీట్ రాసిన అభ్యర్థులందరి ర్యాంకులు సవరించినట్లు తెలిపింది. నీట్ యూజీ పరీక్షలో గతంలో గ్రేస్ మార్కులు పొందిన 1,563 మంది అభ్యర్థులకు 'సమయం వృథా' కారణంగా ఎన్టీఏ జూన్ 23న రీ-ఎగ్జామినేషన్ నిర్వహించింది. గ్రేస్ మార్కులు ఇవ్వడాన్ని సుప్రీంకోర్టు తప్పుబట్టింది. దీంతో వారందరికీ ఎన్టీఏ మరోసారి నిర్వహించింది. గత నెల 23న 1563 మందికి మరోసారి పరీక్ష నిర్వహించగా.. 813 మంది హాజరైనట్లు పేర్కొంది. అన్ని ప్రశ్నలకు సమాధానాలతో ఫైనల్ కీని వెబ్ సైట్ లో ఉంచినట్లు తెలిపింది. పైనల్ స్కోర్ కార్డులు exams.nta.ac.in వెబ్ సైట్ లో చూసుకోవచ్చు. ఈస్కోరు ఆధారంగానే మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ కౌన్సెలింగ్ ప్రక్రియను ప్రారంభించనుంది

నీట్ పేపర్ లీకేజీలు

నీట్ పేపర్ లీకేజీలపై దేశవ్యాప్తంగా నిరసనలు చెలరేగాయి. దీంతో, ఎన్టీఏలో సంస్కరణల కోసం ఉన్నతస్థాయి కమిటీని నియమించింది కేంద్రం. కాగా..వివాదాల దృష్ట్యా ఈసారి ఫలితాల్ని ఎన్టీఏ పక్కాగా విడుదల చేసింది ఎన్టీఏ. పరీక్ష తర్వాత ఆన్సర్‌ కీ, ఓఎంఆర్‌ ఆన్షర్‌ షీట్లను పబ్లిక్‌ నోటీస్‌ ద్వారా అందుబాటులో ఉంచింది. అభ్యర్థుల నుంచి అభ్యంతరాల్ని కూడా స్వీకరించింది. ఆ అభ్యంతరాలు నిపుణులు పరిశీలించాకే తుది కీని విడుదల చేసింది. ఇప్పుడు ఫలితాలను వెబ్ సైట్ లో ఉంచింది.

Advertisement

Next Story