- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కోడి కూర వండని భార్య.. భర్త చేసిన పనికి షాక్‌లో కుటుంబ సభ్యులు
దిశ, వెబ్ డెస్క్: ఇటీవల కాలంలో చాలా మంది దంపతులు చిన్న చిన్న విషయాలకే గొడవలు పడుతూ దారుణాలకు పాల్పడుతున్నారు. తమ కోరికలు నెరవేరలేదని మనస్థాపానికి గురై క్షణికావేశంలో ప్రాణాలు తీసుకుంటూ కుటుంబ సభ్యులకు కన్నీటిని మిగులుస్తున్నారు. పలు కారణాలతో బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. తాజాగా, ఓ వ్యక్తి భార్య కోడి కూర వండలేదని ఆత్మహత్య చేసుకున్నాడు.
వివరాల్లోకి వెళితే.. ఉత్తర ప్రదేశ్‌లోని లక్నోలోని ఝాన్సీ ప్రాతంలో పవన్-ప్రియాంక జంట నివాసముంటుంది. వీరికి నాలుగేళ్ల కిందటే వివాహం జరిగింది. ఇక వీరి దాంపత్య జీవితం సాఫీగా సాగుతుంది. ఈ క్రమంలో పవన్ గురువారం రాత్రి చికెన్ తీసుకుని ఇంటికి వెళ్లాడు. కోడి కూర వండమని భార్యకు చెప్పాడు. అయితే అప్పటికే ప్రియాంక అన్నం, కూర వండి రెడీగా పెట్టానని వండనని చెప్పింది. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం మొదలైంది. అది కాస్త పెరగడంతో పవన్ మనస్థాపానికి గురై గదిలోకి వెళ్లి ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అది గమనించిన పవన్ సోదరుడు వెంటనే తలుపులు తెరిచి చూడటంతో అప్పటికే మృతి చెందాడు. మృతుడి సోదరుడు పోలీసులకు సమాచారం అందించాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాధితుడి మృతదేహాన్ని పోస్ట్‌మార్టంకు తరలించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.