- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
విద్యార్థులకు గుడ్ న్యూస్.. స్టేషనరీపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం!
దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగిన 49వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం ముగిసింది. ఢిల్లీలో జరిగిన ఈ మీటింగ్‌కు తెలంగాణ ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిలతో పాటు ఆయా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ఆర్థిక మంత్రులు, రాష్ట్రాల సీనియర్ అధికారులు, కేంద్ర ప్రభుత్వ అధికారులు హాజరయ్యారు. కాగా, ఈ సమావేశంలో జీఎస్టీ కౌన్సిల్ కీలక నిర్ణయాలు తీసుకుంది. స్టేషనరీపై ఉన్న జీఎస్టీని 18 నుంచి 12 శాతానికి తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది.
దీంతో పెన్సిల్, షార్పనర్ల వంటి స్టేషనరీ ఐటమ్స్ రేట్లు తగ్గనున్నాయి. అంతేకాకుండా రాష్ట్రాలకు జూన్ వరకు ఉన్న రూ 16,982 కోట్ల జీఎస్టీ బకాయిలను చెల్లించేందుకు ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. అయితే, రాష్ట్ర ప్రభుత్వాలు ఒప్పుకుంటే పెట్రో ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకువస్తామని ఇటీవల కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించడంతో ఈ సమావేశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కానీ, ఇవాళ ఢిల్లీ వేదికగా జరిగిన ఈ మీటింగ్‌లో దీనికి సంబంధించి ఎలాంటి ప్రస్థావన రాలేదని సమాచారం.