దేశంలో తొలి ‘యాపిల్’ రిటైల్‌ స్టోర్‌ ప్రారంభానికి సిద్ధం.. ఎక్కడంటే..!

by Shiva |
దేశంలో తొలి ‘యాపిల్’ రిటైల్‌ స్టోర్‌ ప్రారంభానికి సిద్ధం.. ఎక్కడంటే..!
X

దిశ, వెబ్ డెస్క్: దేశంలోనే తొలి అధికారిక ‘యాపిల్’ రిటైల్‌ స్టోర్‌ ప్రారంభానికి సిద్ధమైంది. ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ లోని జియో వరల్డ్‌ డ్రైవ్‌ మాల్‌ లో రేపు ఉదయం రిటైల్ స్టోర్ అందుబాటులోకి రానుంది. ఈ నేపథ్యంలో ముంబై స్టోర్‌కు సంబంధించి కొన్ని ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. స్టోర్‌ మొత్తం చాలా రిచ్‌ గా కనిపిస్తోంది. ముంబైలోని యాపిల్ రిటైల్‌ స్టోర్‌ ను 22,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేశారు. లాస్‌ఎంజెల్స్‌, న్యూయార్క్‌, బీజింగ్‌, మిలాన్‌, సింగ్‌పూర్‌ వంటి నగరాల తర్వాత ముంబైలో యాపిల్‌ ఐఫోన్‌ రిటైల్‌ స్టోర్‌ ప్రారంభం కానుంది. ముంబై తర్వాత మరో రెండు రోజుల్లో దేశ రాజధాని ఢిల్లీలో రెండో యాపిల్‌ రిటైల్‌ స్టోర్‌ను ఆ సంస్థ లాంచ్ చేయనుంది. ఢిల్లీ సాకెట్‌లోని సెలెక్ట్‌ సిటీ వాక్‌ మాల్‌లో ఏప్రిల్‌ 20న ఉదయం 10 గంటలకు యాపిల్‌ రిటైల్‌ స్టోర్‌ను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు టెక్‌ దిగ్గజం ఆపిల్ ఇప్పటికే వెల్లడించింది.

Advertisement

Next Story

Most Viewed