- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వీకే పాండియన్ రాజకీయ సన్యాసం తీసుకుంటారా.. ఇదంతా పొలిటికల్ స్టంటేనా?
దిశ, నేషనల్ బ్యూరో: ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు వెలువడ్డాయి. బీజేడీ ఆధిక్యానికి బ్రేకులు పడ్డాయి. 147 అసెంబ్లీ స్థానాలకుగాను 78 చోట్ల భాజపా విజయం సాధించి ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమనం చేసుకుంది. దీంతో ఆరోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టి రికార్డు సాధించాలనుకున్న నవీన్ పట్నాయక్ ఆశ నిరాశగానే మిగిలిపోయింది. ఈసారి నవీన్ పట్నాయక్ ఒడిశా సీఎం కాకపోతే.. తాను రాజకీయాల నుంచి వైదొలుగుతానని వీకే పాండియన్ ఎన్నికల ప్రచారంలో తెలిపారు. ఐఏఎస్ ఆఫీసర్ నుంచి పొలిటీషియన్ గా మారిన వీకే పాండియన్ పోలింగ్ కు కొద్దిరోజుల మందు మాట్లాడారు. కానీ, పట్నాయక్ మరోసారి సీఎం కాకపోతే, తాను రాజకీయాల నుంచి సన్యాసం తీసుకుంటా అని భీష్మ ప్రతిజ్ఞ చేశారు. అయితే.. బీజేడీ అధికారంలోకి రాలేదు.
సూపర్ సీఎం ఏంచేయనున్నారు?
ఇదిలా ఉంటే.. గత ఏడాది పాండియన్ స్వచ్ఛంద ఉద్యోగ విరమణ చేసి.. బీజేడీలో చేరారు. 2019 ఎన్నికల ముందు నుంచి ఆయన నవీన్‌కు నమ్మకమైన అధికారిగా ఉన్నారు. తెర వెనకే ఉంటూ బీజేడీకి కావాల్సిన మద్దతు అందించారు. పదవీ విరమణ తర్వాత బీజేడీలో చేరిపోయారు. నవీన్ నిర్ణయాల్లో కీలక పాత్ర పోషించే ఆయన్ను విమర్శకులు ‘సూపర్ సీఎం’ అని పిలిచేవారు. అయితే, పాండియన్ కు బయటివ్యక్తి అనే ముద్ర పడిపోయింది. కాగా, పాండియన్.. గతంలో చెప్పినట్టుగా ఇప్పుడు రాజకీయ సన్యాసం చేస్తారా? లేదా? అనేది ప్రశ్నార్థకంగా మారింది. లేకపోతే ఇదంతా పొలిటకల్ స్టంటా తెలియాల్సి ఉంది.