- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
'రాజకీయ పార్టీలను ఆపేందుకు ప్రత్యేక చట్టాలు లేవు'
దిశ, డైనమిక్ బ్యూరో: ఎన్నికల సమయంలో ద్వేషపూరిత ప్రసంగాలు మరియు పుకార్లను నిరోధించడానికి, రాజకీయ పార్టీలు, ప్రజలు సామరస్యానికి భంగం కలిగించకుండా నిరోధించడానికి ప్రత్యేకంగా చట్టాలు ఏమీ లేవన్న ఎన్నికల సంఘం పేర్కొంది. ఎన్నికల సమయంలో ద్వేషపూరిత ప్రసంగాల వ్యవహారంపై సుప్రీంకోర్టులో బుధవారం ఎన్నికల సంఘం అఫిడవిట్ దాఖలు చేసింది. ద్వేషపూరిత ప్రసంగాలకు సంబంధించి ఇప్పటి వరకు స్పష్టమైన చట్టం లేదని ప్రస్తుతం ఉన్న చట్టాల్లో.. ద్వేషపూరిత ప్రసంగాల నివారణకు ఎలాంటి చర్యలు పొందుపరచలేదని అఫిడవిట్‌లో ఈసీ పేర్కొంది. ఐపీసీ, ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951 ప్రకారం తాము పని చేస్తున్నామని కానీ, ప్రస్తుత చట్టాల్లో ద్వేషపూరిత ప్రసంగాలు, పుకార్లను నిలుపుదల చేయగలిగే సెక్షన్లు ఏవీ కూడా ఐపీసీ, ప్రజాప్రాతినిధ్య చట్టాల్లో సూచించలేదని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ద్వేషపూరిత ప్రసంగాలకు సంబంధించి సీఆర్పీసీలో అవసరమైన సవరణలు చేయాలని లా కమిషన్ తన 267 వ నివేదికలో సూచించినట్లు కోర్టు దృష్టికి ఈసీ తీసుకువచ్చింది. ఈ విషయంలో తాము తక్షణమే చేయగలిగింది ఏమీ లేదని సర్వోన్నత న్యాయస్థానమే తగిన ఉత్తర్వులు ఇవ్వాలని కేంద్ర ఎన్నికల సంఘం కోరింది.