- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Delhi liquor scam: మాజీ ఎమ్మెల్యే కుమారుడికి 14 రోజుల రిమాండ్
దిశ, డైనమిక్ బ్యూరో: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో వ్యాపార వేత్త గౌతమ్ మల్హోత్రాకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. గౌతమ్ మల్హోత్రా ఈడీ కస్టడీ నేటితో ముగియడంతో అతడిని బుధవారం రౌస్ ఎవెన్యూ స్పెషల్ కోర్టులో అధికారులు హాజరుపరిచారు. ఈ నేపథ్యంలో కోర్టు అతడికి రిమాండ్ విధించింది. కాగా మద్యం కుంభకోణంలో కీలక పాత్ర పోషించాడనే ఆరోపణలతో గత వారం గౌతమ్‌ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. గ్రూపులుగా ఏర్పడటంలో గౌతమ్ మల్హోత్రాది కీ రోల్ ఉందని ఈడీ ఆరోపిస్తోంది.
నిబంధనలు ఉల్లంఘించి మద్యం పాలసీని మల్హోత్రా పొందినట్లు పేర్కొంది. గౌతమ్ మల్హోత్రా తండ్రి దీపక్ మల్హోత్రా శిరోమణి అకాలీదళ్‌కు చెందిన మాజీ ఎమ్మెల్యే. మరో వైపు ఈ కేసులో రోజుకో ట్విస్ట్ నమోదు అవుతోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో పాటు ఆమె భర్త అనిల్ కుమార్ పేరును దర్యాప్తు సంస్థలు పేర్కొనడం తెలంగాణలో సంచలనంగా మారింది. దీంతో ఏ క్షణంలో ఏం జరుగుతుందో అనే ఉత్కంఠ రాష్ట్ర రాజకీయాల్లో కొనసాగుతోంది.
Read more:
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో బిగ్ ట్విస్ట్.. MLC కవిత భర్తపై ఈడీ ఫోకస్!