మీరు మారరు రా బై..! అయోధ్య రైల్వే స్టేషన్‌లో దుస్థితి!

by Ramesh N |
మీరు మారరు రా బై..! అయోధ్య రైల్వే స్టేషన్‌లో దుస్థితి!
X

దిశ, డైనమిక్ బ్యూరో: అయోధ్యలో కొత్తగా నిర్మించిన రామాలయం జనవరి 22న ప్రారంభమైన విషయం తెలిసిందే. భక్తుల తాకిడి పెరుగుతుందని అయోధ్యలో కొత్తగా ఎయిర్‌పోర్టు, రైల్వే ష్టేషన్‌ను నిర్మించింది. ఎంతో ప్రతిష్టాత్మకంగా వీటిని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ప్రయాణికులకు అన్ని సౌకర్యాలతో.. అద్దంలాగా అక్కడి స్టేషన్‌ను కేంద్ర రైల్వే శాఖ తీర్చిదిద్దింది. అయితే భారత్‌లో ఉన్న కొన్ని రైల్వే ష్టేషన్ల మాదిరిగానే దాన్ని కొందరు ప్రయాణికులు మార్చేశారు. ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయడం, గుట్కా ఊయడం వంటివి ప్రయాణికులు చేస్తున్నారు. స్టేషన్‌లో ఉండే కుర్చీలపై బట్టలు అరేయడం కూడా చేస్తున్నారు.

చెత్త వేయడానికి డస్ట్ బిన్‌లు ఉన్న కూడా ప్రయాణికులు తక్కువగానే వినియోగిస్తున్నట్లు కనబడుతోంది. ఈ క్రమంలోనే రైల్వేస్టేషన్‌కు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అయ్యాయి. ఈ రకంగా చేసిన వారిపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ప్రారంభించిన రెండు నెలల్లోనే దారుణం చేశారు.. మీరు మారరు రా బై అంటూ విమర్శిస్తున్నారు. కొందరు చదువుకున్న వారు కూడా పరిశుభ్రతను పాటించడం లేదని నెటిజన్లు అభిప్రాయపడ్డారు. దేవుని సన్నిధి.. ఎంతో ప్రతిష్టాత్మకంగా, అధునాతన సౌకర్యాలతో నిర్మితమైన అయోధ్యలో ఇలా చేయడం చాలా దారుణమని, ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని అధికారులకు నెటిజన్లు సూచనలు చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed