- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Hospital: దాడి చేసిన 6 గంటల్లోగా కేసు పెట్టండి.. ఆస్పత్రులకు కేంద్రం ఆదేశం
దిశ, నేషనల్ బ్యూరో: ఇటీవల పశ్చిమ బెంగాల్ హత్యాచార ఘటనకు సంబంధించి ఆర్‌జీ కర్ ఆసుపత్రిలో దుండగులు విధ్వంసానికి పాల్పడిన నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆసుపత్రుల్లో డ్యూటీలో ఉన్న డాక్టర్లు, సిబ్బంది, ఆరోగ్య సంరక్షణ కార్యకర్తపై లేదా ప్రాంగణంపై దాడి చేసిన 6 గంటల్లోగా పోలీసులకు ఫిర్యాదు చేయాలని అన్ని ప్రభుత్వ ఆసుపత్రులకు యూనియన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ (డిజీహెచ్‌ఎస్) శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు.
ఒకవేళ దాడి జరిగిన నిర్ణీత గడువులోగా పోలీసులకు ఫిర్యాదు చేయకపోతే దానికి సంబంధిత ఆసుపత్రి హెడ్ బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులను శుక్రవారం ఉదయం విడుదల చేశారు. ఇటీవల కాలంలో ఆసుపత్రుల్లో డాక్టర్లు, వైద్య సిబ్బందిపై దాడులు పెరిగాయి. ముఖ్యంగా ఆర్‌జీ కర్ ఆసుపత్రిలో జరిగిన దాడి ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశం అయింది. వైద్య సిబ్బంది విధి నిర్వహణలో తమకు తగిన రక్షణ అందించాలని నిరసనలు చేస్తున్న తరుణంలో ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న కేంద్రం తాజాగా ఈ ఉత్తర్వులను జారీ చేసింది.