- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మణిపూర్‌లో నలుగురు పౌరుల హత్య కేసు..నిందితుడిని అరెస్టు చేసిన ఎన్ఐఏ
దిశ, నేషనల్ బ్యూరో: ఈ ఏడాది జనవరిలో మణిపూర్‌లోని బిషున్‌పూర్ జిల్లాలో నలుగురు పౌరులను హత్య చేసిన కేసులో నేషనల్ ఇన్వెస్టిగేష్ ఏజెన్సీ(ఎన్ఐఏ) ఓ వ్యక్తిని అరెస్టు చేసింది. నిందితుడు ప్రస్తుతం మరో కేసులో గౌహతి జైలులో ఉన్నట్టు తెలిపింది. ఈ నేపథ్యంలోనే చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద అదుపులోకి తీసుకున్నట్టు పేర్కొంది. అరెస్టు చేసిన వ్యక్తిని మణిపూర్ నివాసి అయిన లున్‌మిన్సే కిప్‌జెన్ అలియాస్ లాంగిన్‌మాంగ్ అలియాస్ మాంగ్ అలియాస్ లెవీగా గుర్తించారు. ఈ కేసులో అరెస్టైన మొదటి వ్యక్తి ఆయనే కావడం గమనార్హం. కాగా, 2024 జనవరి 18న బిష్ణుపూర్‌లోని నింగ్‌తౌఖోంగ్ ఖా ఖునౌలో ఉన్న వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ సమీపంలో సాయుధ మిలిటెంట్లు నలుగురు పౌరులను దారుణంగా హత్య చేశారు. అత్యధునిక ఆయుధాలతో విచక్షణారహితంగా కాల్పులు జరిపి చంపేశారు. దీంతో ఫిబ్రవరి 9న దీనిపై కేసు నమోదు చేసిన ఎన్ఐఏ తాజగా అరెస్టు చేసింది. మణిపూర్‌లో కొనసాగుతున్న జాతి హింసలో భాగమైన ప్రాణాంతక దాడుల్లో లున్‌మిన్సే కిప్‌జెన్ చురుకుగా పాల్గొన్నట్లు దర్యాప్తులో తేలింది.