పశ్చిమ బెంగాల్‌లో ఉద్రిక్తత: ఈవీఎం, వీవీప్యాట్‌లను చెరువులో విసిరేసిన దుండగులు

by vinod kumar |
పశ్చిమ బెంగాల్‌లో ఉద్రిక్తత: ఈవీఎం, వీవీప్యాట్‌లను చెరువులో విసిరేసిన దుండగులు
X

దిశ, నేషనల్ బ్యూరో: లోక్ సభ ఎన్నికల్లో భాగంగా చివరి దశ ఎన్నికలు శనివారం ప్రారంభమయ్యాయి. అయితే పశ్చిమ బెంగాల్‌లో పోలింగ్ సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దక్షిణ 24 పరగణాస్ జిల్లా కుల్తాయ్‌లోని బూత్ నంబర్ 40, 41లోని ఈవీఎం, వీవీప్యాట్ మిషీన్లను కొందరు దుంగడులు పోలింగ్ బూత్ నుంచి ఎత్తుకెళ్లి స్థానికంగా ఉండే ఓ చెరువులో విసిరేశారు. ఈ ఘటనపై పశ్చిమ బెంగాల్ ఎన్నికల సంఘం వెంటనే స్పందించింది. దుండగులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపింది. ఓటింగ్ ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగుతోందని వెల్లడించింది. అలాగే భాంగర్‌లో సీపీఎం, ఐఎస్‌ఎఫ్ కార్యకర్తలు టీఎంసీ మద్దతుదారులపై బాంబు దాడికి పాల్పడినట్టు తెలుస్తోంది.

కాగా, ఎన్నికల సంఘం వివరాల ప్రకారం.. ఉదయం తొమ్మిది గంటల వరకు మొత్తంగా 11.31శాతం ఓటింగ్ నమోదైంది. హిమాచల్ ప్రదేశ్‌లో అత్యధికంగా 14.35శాతం పోలింగ్ జరగగా.. ఒడిశాలో అత్యల్పంగా 7.69శాతం ఓటింగ్ నమోదైంది. ఎన్నికల్లో పలువురు ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఉత్తరప్రదేశ్ సీఎం యోగీ ఆధిత్యనాథ్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్, హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్వింధర్ సింగ్ సుఖు, క్రికెటర్ హర్భజన్ సింగ్‌లు ఓటేశారు. అలాగే బిహార్‌లో ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ తో పాటు ఆయన కుటుంబ సభ్యులు ఓటు హక్కు వినియోగించుకున్నారు.

Advertisement

Next Story

Most Viewed