- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Murder : ప్రైవేట్ వీడియోలతో గర్ల్ ఫ్రెండ్‌కి బెదిరింపులు.. స్నేహితుడిని కడతేర్చిన మైనర్
దిశ, నేషనల్ బ్యూరో : గర్ల్ ఫ్రెండ్‌తో ఉన్న ప్రైవేట్ వీడియోలను సేకరించి తనతో గడపాలని వేధిస్తున్న స్నేహితుడిని ఓ మైనర్ దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన యూపీ మీరట్‌లో సోమవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హత్యకు గురైన అభివన్, నిందితుడు(17) క్లాస్ మేట్స్. వీరిద్దరు ఇరుగుపొరుగు ఇళ్లలో ఉంటున్నారు. ఇంజినీరింగ్ ఎంట్రన్స్ కోసం కోచింగ్ తీసుకుంటున్నారు. శనివారం ఈ ఇద్దరు కోచింగ్‌కని వెళ్లారు. కాగా అభినవ్ మాత్రం తిరిగి ఇంటికి రాలేదు. దీంతో అభినవ్ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సీసీ టీవీ ఫుటేజీలో ఇద్దరు కలిసి వెళ్లినట్లుగా తేలింది. నిందితుడిని పిలిపించిన పోలీసులు విచారించారు. అభినవ్‌ను తానే హత్య చేసినట్లు నిందితుడు ఒప్పుకున్నాడు.
‘నేను నా గర్ల్ ఫ్రెండ్‌తో కలిసి ఉన్న వీడియోలను అభినవ్ దొంగిలిచాడు. వాటిని చూపి తనతో గడపాలని గర్ల్ ఫ్రెండ్‌ని బ్లాక్ మెయిల్ చేశాడు. అందుకే హత్య చేయాలని నిర్ణయించుకున్నాను. ఫోన్ అమ్మాలని చెప్పి అభినవ్‌ను తీసుకెళ్లాను. రూ.8వేలకు ఫోన్ అమ్మేశాను. అనంతరం రెస్టారెంట్‌కు వెళ్లి ఇద్దరం కలిసి భోజనం చేశాం. తిరిగి వస్తుండగా ఓ బోరుబావి వద్ద ఆపాను. సుత్తెతో అభినవ్ తలపై బాదాను. అతను కింద పడిపోయిన తర్వాత మళ్లీ దాడి చేశాను.’ అని నిందితుడు పోలీసులకు తెలిపాడు.