‘మన్ కీ బాత్’ కు పోటీగా ‘స్పీకింగ్ ఫర్ ఇండియా’.. సీఎం కీలక నిర్ణయం

by Harish |   ( Updated:2023-08-31 12:46:21.0  )
‘మన్ కీ బాత్’ కు పోటీగా ‘స్పీకింగ్ ఫర్ ఇండియా’.. సీఎం కీలక నిర్ణయం
X

చెన్నై: విపక్షాల ‘ఇండియా’ కూటమిలో కీలక పాత్ర పోషిస్తున్న తమిళనాడు సీఎం స్టాలిన్ బీజేపీ సర్కారుపై యుద్ధానికి కొత్త అస్త్రాన్ని రెడీ చేస్తున్నారు. ప్రధాని మోడీ ‘మన్ కీ బాత్’ ప్రోగ్రామ్‌కు పోటీగా ‘స్పీకింగ్ ఫర్ ఇండియా’ పేరుతో పాడ్ కాస్ట్ సిరీస్‌ను రిలీజ్ చేయాలని ఆయన నిర్ణయించారు. ఈ ప్రోగ్రామ్ ద్వారా దేశం ఎదుర్కొంటున్న సవాళ్లు, గత తొమ్మిదేళ్ల బీజేపీ సర్కారు వైఫల్యాలపై జాతిని ఉద్దేశించి స్టాలిన్ మాట్లాడనున్నారు. దీనికి సంబంధించిన ప్రోమోను ఆయన ట్విట్టర్ వేదికగా విడుదల చేశారు.

1 నిమిషం 14 సెకన్ల నిడివి కలిగిన ఈ వీడియోను ‘చెక్ 1..2..3’ అంటూ ఆయన మొదలుపెట్టారు. దేశాన్ని బీజేపీ విధ్వంసం చేస్తోందని స్టాలిన్ విమర్శలు గుప్పించారు. ప్రశ్న, దానికి సమాధానం తరహాలో తన పాడ్ కాస్ట్ సిరీస్‌ ఉంటుందని చెప్పారు. దేశ భవిష్యత్ బాగుండాలంటే ప్రజలు మరోసారి బీజేపీకి ఛాన్స్ ఇవ్వొద్దన్నారు. ఈ పాడ్‌కాస్ట్ సిరీస్‌ను ఇంగ్లీష్‌తో ఇతర భాషలలోకి కూడా అనువాదం చేస్తారని తెలుస్తోంది.

Advertisement

Next Story

Most Viewed