Supriya Sule: నాకు కాల్స్, మెసేజెస్ చేయొద్దు

by Shamantha N |
Supriya Sule: నాకు కాల్స్, మెసేజెస్ చేయొద్దు
X

దిశ, నేషనల్ బ్యూరో: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ( శరద్‌ పవార్‌) ఎంపీ సుప్రియా సూలే ఫోన్, వాట్సప్ హ్యాక్ అయ్యింది. ఈ విషయాన్ని ఆదివారం ఎక్స్ వేదికగా ఆమె వెల్లడించారు. ‘ముఖ్యగమనిక: నా మొబైల్‌ ఫోన్‌, వాట్సాప్‌ హ్యాక్‌ అయింది. బారామతి ప్రజలెవరూ దయచేసి నాకు కాల్స్, మెసేజెస్ చేయొద్దు. ఈ విషయంపై పోలీసుల సాయం కోరాను’ అని తెలిపారు. మరోవైపు.. ప్రహార్ జనశక్తి పార్టీ (పీజేపీ) అధ్యక్షుడు, అధికార మహాయుతి మిత్రపక్షం ఎమ్మెల్యే ఓంప్రకాష్ అలియాస్ బచ్చు కడు శనివారం పూణెలో ఎన్సీపీ( ఎస్పీ) చీఫ్ శరద్ పవార్‌ను కలిశారు. భేటీ తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. అధికార కూటమితో కొనసాగాలా లేదా అనే విషయంపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటానని అన్నారు. సెప్టెంబర్ 1న తన నిర్ణయాన్ని వెల్లడిస్తానని పేర్కొన్నారు. ఆయనవ్యాఖఅయలపై ఎంపీ సుప్రియా సూలే స్పందించారు. దివ్యాంగల కోసం ఓంప్రకాష్ తీవ్రంగా కృషి చేశారని కొనియాడారు. అదేవిధంగా రాష్ట్రాభివృద్ధికి అందరూ ఐక్యంగా పోరాడాలని కోరారు.

Advertisement

Next Story

Most Viewed