పన్నీరు సెల్వంకు సుప్రీం షాక్!

by Sathputhe Rajesh |
పన్నీరు సెల్వంకు సుప్రీం షాక్!
X

దిశ, డైనమిక్ బ్యూరో: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వంకు సుప్రీంకోర్టు షాకిచ్చింది. అన్నాడీఎంకే నాయకత్వంపై మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పునే సుప్రీంకోర్టు సమర్ధించింది. అన్నాడీఎంకే సింగిల్ లీడర్‌గా మాజీ సీఎం పళనిస్వామిని పునరుద్ధరిస్తూ మద్రాస్ హైకోర్టు డివిజన్ బెంచ్ గతంలో తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును అన్నాడీఎంకేకు చెందిన మరో లీడర్ పన్నీరు సెల్వం సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. దీనిపై విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం అన్నాడీఎంకే పగ్గాలు పళని స్వామికే అని గురువారం తేల్చిచెప్పింది.

దివంగత సీఎం జయలలిత మరణం తర్వాత అన్నాడీఎంకేలో పళని స్వామి వర్సెస్ పన్నీరు సెల్వం వర్గాల మధ్య ఆధిపత్య పోరు సాగుతోంది. ఈ వ్యవహారంపై గతంలో ఇరు వర్గాలు కోర్టును ఆశ్రయించాయి. ఈ నేపథ్యంలో పార్టీ తాజాగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో పన్నీరు సెల్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారనేది ఉత్కంఠగా మారాయి. ఇప్పటికే బీజేపీతో పొత్తు విషయంలో అన్నా డీఎంకేలోని పన్నీరు, పళని వర్గాల మధ్య బేధాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో పన్నీరు సెల్వం నిర్ణయం తమిళనాడు రాజకీయాల్లో మరింత సంచలనంగా మారే అవకాశాలు ఉన్నాయనే చర్చ జరుగుతోంది.

Advertisement

Next Story