- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రుతు నొప్పి సెలవుపై ఒక విధానాన్ని రూపొందించండి.. కేంద్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఒత్తిడి
న్యూఢిల్లీ: రుతు నొప్పి జీవసంబంధమైన ప్రక్రియ. అయినప్పటికీ యజమానులు వారి బాధను పట్టించుకోకపోవడంతో మహిళా శ్రామికులు నిరుత్సాహంగా పనుల్లో పాల్గొంటుంటారు. అయితే రుతు నొప్పి సెలవుల పాలసీని రూపొందించాలని కేంద్ర ప్రభుత్వంపై సుప్రీం కోర్టు ఒత్తిడి తెస్తోంది. భారత ప్రధాన న్యాయమూర్తి డీవీ చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం రుతు నొప్పి సెలవులపై ఒక విధానాన్ని రూపొందించాలని కోరింది.
అంతేకాదు కేంద్ర మహిళ - శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖను సంప్రదించాలని పిటిషనర్‌కు చంద్రచూడ్ సూచించారు. విద్యార్థినులు, మహిళా ఉద్యోగినులకు రుతు నొప్పి సెలవులు మంజూరు చేసేందుకు నిబంధనలను రూపొందించేలా రాష్ట్రాలని ఆదేశించాలని కోరుతూ.. శైలేంద్ర మణి తివారి దాఖలు చేసిన పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం విచారించింది. రుతు క్రమం అనేది జీవ ప్రక్రియ.. విద్యాసంస్థలు మహిళల పట్ల వివక్ష చూపుతున్నారని తివారీ అన్నారు. ’మీ వాదనను మేము కాదనడం లేదు. కానీ ఆచరణలో యజమానులు అదే చేయవచ్చని ఓ విద్యార్థి చెప్పారు. ఈ సమస్యకు భిన్నమైన కోణాలు ఉన్నాయి. వారు ఒక విధానాన్ని రూపొందించనివ్వండి. దానిని మేము పరిశీలిస్తాం’ అని చంద్రచూడ్ అన్నారు.