Supreme Court: సుప్రీం కోర్టులో భారీ విస్తరణ..

by Vinod kumar |   ( Updated:2023-08-15 12:56:34.0  )
Supreme Court: సుప్రీం కోర్టులో భారీ విస్తరణ..
X

న్యూఢిల్లీ: సుప్రీం కోర్టులో భారీ విస్తరణ పనులు చేపట్టనున్నట్లు భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ తెలిపారు. అదనంగా 27 కోర్టు గదులు, 4 రిజిస్ట్రార్ కోర్టు గదులు, న్యాయమూర్తులకు, న్యాయవాదులకు అదనపు సౌకర్యాలు, మీటింగ్ రూమ్, సుప్రీం కోర్టు బార్ అసోసియేషన్, సుప్రీం కోర్టు అడ్వకేట్స్ ఆన్ రికార్డ్ అసోసియేషన్, మహిళా న్యాయవాదుల కోసం ప్రత్యేక సౌకర్యాలు కల్పించనున్నట్లు మంగళవారం స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా సీజేఐ చంద్రచూడ్ చెప్పారు. ఈ అదనపు సౌకర్యాల కోసం మ్యూజియం, అనెక్స్ భవనాన్ని కూల్చివేసి కొత్త భవనాన్ని నిర్మించాలని సుప్రీం కోర్టు ప్లాన్ చేస్తున్నట్లు పేర్కొన్నారు.

ఈ ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వానికి సుప్రీం కోర్టు సమర్పించిందని, న్యాయ శాఖ వద్ద ఫైల్ పెండింగ్‌లో ఉందని సీజేఐ వివరించారు. అదనంగా 12 కోర్టు గదులను నిర్మించేందుకు ప్రస్తుత భవనంలో కొంత భాగాన్ని కూల్చివేయాల్సి వస్తుందని ఆయన తెలిపారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని అభివృద్ధి చేసేందుకు శాసనసభ, న్యాయవ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థలు 76 ఏళ్లుగా ఎంతో కృషి చేశాయన్నారు.

Advertisement

Next Story

Most Viewed